Falaknuma Express Train : ట్రాక్ పై వెళ్తున్న రైలు( train) నుంచి బోగీలు విడిపోయాయి. అసలే సూపర్ ఫాస్ట్ ఆపై అతివేగంతో వెళ్తున్న ఆ రైలు రెండు విభాగాలుగా విడిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చాలా భయపడ్డారు. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి రైలు నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఎవరికి ఏ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి హౌరా జంక్షన్ కు రాకపోకలు సాగించే ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఈరోజు భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈరోజు రైలు సికింద్రాబాద్ నుంచి హౌరా వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read : పరీక్ష తప్పిన విద్యార్థులు..తప్పు ఎవరిది.. పవన్ సంచలన నిర్ణ యం
* పలాస కు సమీపంలో..
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ కు( Srikakulam district Palasa Railway Station) కూత వేటు దూరంలో ఈ ఘటన జరిగింది. రైలులో బోగీలు మధ్యలో రెండుగా విడిపోయాయి. దీంతో ఆయా భోగిల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సూపర్ ఫాస్ట్ రైలు కావడం.. మధ్యలో బోగీలు విడిపోవడంతో భారీ ప్రమాదం జరిగినట్లు భావించారు ప్రయాణికులు. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో రైల్వే అధికారులు సైతం ఉపశమనం చెందారు.
* బోగీల మధ్య కప్లింగ్ ఊడిపోవడంతో..
శ్రీకాకుళం జిల్లా పలాస కు వచ్చేసరికి ఈ ఘటన చోటు చేసుకుంది. భోగిల మధ్య తగిలించే కప్లింగ్( coupling) ఊడిపోవడం వల్లే రైలు విడిపోయినట్లు రైల్వే సిబ్బంది చెబుతున్నారు. దీంతో తిరిగి భోగిలను జాయింట్ చేసే పనులను రైల్వే అధికారులు ముమ్మరంగా సాగిస్తున్నారు. అనంతరం ఆ రైలు బయలుదేరి వెళ్లనుంది. రెగ్యులర్గా రాకపోకలు సాగించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు ఇలా మధ్యలో కప్లింగ్ ఊడిపోయి భోగీలు ఎందుకు విడిపోయాయి అన్నదానిపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో విద్రోహ చర్య ఉందా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.
* ప్రయాణికుల్లో ఆందోళన..
ఈ ఘటనతో భోగిల్లో ఉన్న ప్రయాణికులు( passengers ) భయాందోళనకు గురయ్యారు. అసలేం జరిగిందో వారికి తెలియడం లేదు. ముందున్న భోగీలు విడిపోవడం.. రైలు ముందుకు కదలడంతో వెనుక బోగీల్లో ఉన్నవారు తెగ ఆందోళనకు గురయ్యారు. రైలు దూకుడుకు కళ్లెం పడింది. విడిపోయిన బోగీలు సైతం కొంతమందికి వెళ్లి ఆగాయి. దీంతో విషయం తెలుసుకొని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : పరిటాల అడ్డాలోకి జగన్.. పొలిటికల్ హై టెన్షన్.. ఏం జరుగుతుందో?