Fake Wedding Trend: రాను రాను పెళ్లికి నిర్వచనం మారేలా ఉంది. ఒకప్పుడు పెళ్లంటే 10, 15 రోజుల ముందుగానే బంధువులు వచ్చి అన్ని పనుల్లో సహాయం చేసేవారు. వారం ముందు నుంచే ఆ ఇంట్లో వివాహం జరగనుంది అని అర్థం అయ్యేది. 5 రోజుల పెళ్లి ఎంత చూడ చక్కగా జరిగేదో కదా. కానీ ఇప్పుడు చాలా వరకు మారిపోయింది. అక్కడక్కడ ఇప్పటికీ సందడిగా జరుగుతున్నా కూడా తక్కువే అని వాపోతున్నారు సంప్రదాయాలంటే నచ్చేవారు. ఇక ఇప్పుడు ఓ ట్రెండ్ నడుస్తోంది. అదేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు కావచ్చు. అదే ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్.
భారతదేశంలో వివాహం అనేది కేవలం ఒక వేడుక కాదు. రెండు కుటుంబాల కలయిక. వివాహం రెండు కుటుంబాలు, సంబంధాలు, సంప్రదాయాలు, గొప్పతనాన్ని కలిసి చూసే ఒక వేడుక. అందుకే దాని సన్నాహాలు చాలా ముందుగానే ప్రారంభమవుతాయి. అయితే, మారుతున్న కాలంతో పాటు, వివాహం. ఆచారాలు కూడా మారుతున్నాయి. దీనికి అతిపెద్ద ఉదాహరణ నకిలీ వివాహం. ఇక్కడ మీరు వధూవరులు లేకుండా కూడా వివాహ ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. అంటే అర్థ: అవుతుందా ఇప్పుడు పెళ్లిల్లు ఎలా మారాయా? ఇలాగే కంటిన్యూ అయితే ఈ జనరేషన్ వారికి, 40 సంవత్సరాల పై బడిన వారి ఆలోచనలో చాలా వ్యత్యాసం ఉంటుంది.
ప్రస్తుతం నకిలీ వివాహ పార్టీల ట్రెండ్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా యువ తరం వధూవరులు లేకుండా ఈ పార్టీలలో వివాహపు అన్ని ఆనందాలను ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు దీనికి కారణం ఏంటో కూడా తెలుసుకుందాం. యువ తరం వారు వివాహపు ఆనందాన్ని, వేడుకలను ఆస్వాదించవచ్చని భావిస్తున్నారు. అది కూడా ఎటువంటి బాధ్యత లేకుండా..
Also Read: సక్సెస్ అవ్వాలంటే ఇవి పాటించాల్సిందే.. థామస్ అల్వా ఎడిసన్ సక్సెస్ వెనుక కారణం?
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రజలు తమ స్నేహితులతో నిజమైన వివాహంలాగా నకిలీ వివాహాన్ని ఆస్వాదిస్తున్నారు. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, మీరు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకోవడానికి, మీరు దాదాపు రూ. 550 నుంచి 1499 వరకు ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
అంతేకాదు మీకు ఇష్టమైన దుస్తులు ధరించి, నకిలీ వివాహం కోసం డబ్బు ఖర్చు చేసి మరీ దానిలో భాగం అవ్వండి. ఇక్కడ మీరు చాలా సరదాగా గడుపవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భవిష్యత్తులో మీరు ఎటువంటి బాధ్యత తీసుకోవలసిన అవసరం లేదు. ఈ ట్రెండ్ మరింత ప్రజాదరణ పొందుతోంది. ఇక్కడ ప్రజలు వినోదం, సోషల్ మీడియా కంటెంట్ కోసం కూడా ఈ ‘వివాహాలకు’ హాజరవుతున్నారు.
అయితే, వేగంగా పెరుగుతున్న ఈ ట్రెండ్ గురించి వివాదాలు కూడా పెరిగాయి. దీని కారణంగా ప్రజలు ఈ మొత్తం ట్రెండ్‌ను విమర్శిస్తున్నారు. చాలా మంది నకిలీ వివాహాల గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ విషయంపై, నకిలీ వివాహ పార్టీలు వివాహం వంటి పవిత్ర బంధాన్ని దిగజార్చేవి, విలువను తగ్గిస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే వీటిని భహిష్కరించాలని కొందరు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.