Fake Bomb Threat
Fake Bomb Threat : దేశంలో ప్రయాణీకుల విమానాలకు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఆదివారం 25కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియాకు చెందిన ఆరు విమానాలు ఉన్నాయి. ఒక రోజు ముందు శనివారం 30కి పైగా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. దీంతో వందలాది మంది ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు. గత వారం రోజుల్లో 90కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తర్వాత అవన్నీ అబద్ధమని తేలింది. గత కొన్ని రోజులుగా భారత్‌లో విమానంలో బాంబు ఉందనే వదంతులు వేగంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజల్లో భయానక వాతావరణం నెలకొనడమే కాకుండా విమానయాన సంస్థలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. గత వారం రోజుల్లో వచ్చిన బెదిరింపులు తర్వాత విచారణలో అవన్నీ అబద్ధమని.. వట్టి పుకార్లేనని తేలింది. అయితే ప్రతి ఫేక్ కాల్ లేదా బెదిరింపుతో ఎయిర్‌లైన్ కంపెనీలు ఎంత నష్టపోతున్నాయో తెలుసుకుందాం.
ఎంత నష్టం వాటిల్లుతోంది
బాంబు బెదిరింపు కాల్స్ వల్ల విమానయాన సంస్థలు కోట్లాది రూపాయలు నష్టపోతున్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ కాల్స్ వల్ల విమానయాన సంస్థలు రూ.1500 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. తాజాగా ఇలాంటి బెదిరింపు కారణంగా అమెరికా వెళ్తున్న ఓ విమానంలో రూ.మూడు కోట్ల నష్టం వాటిల్లింది. మీడియా నివేదికల ప్రకారం.. భారతదేశంలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 500 కంటే ఎక్కువ విమానాలకు బెదిరింపులు వచ్చాయి. దీంతో రెండు వేల విమానాలు, వాటిలో ప్రయాణించే మూడున్నర లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది.
నష్టం లెక్కలు ఇవే
విమానంలో బాంబు పుకారు వ్యాపించినప్పుడల్లా.. విమాన వ్యవస్థ మొత్తం కదులుతుంది. వెంటనే సమీపంలోని విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా దించారు. ఇది ఏటీఎఫ్ ని వినియోగించడమే కాకుండా విమానాన్ని తనిఖీ చేయడం, ప్రయాణీకుల వసతి కోసం ఏర్పాట్లు చేయడం, వారి గమ్యస్థానానికి తీసుకెళ్లడం కోసం ఎయిర్‌లైన్ సుమారు రూ. మూడు కోట్లు ఖర్చు చేస్తుంది. ఎయిర్‌లైన్ అధికారుల ప్రకారం, ఏదైనా విమానానికి ముప్పు అని తేలితే.. ఆ ఎయిర్‌లైన్ 24 గంటల ఎయిర్ షెడ్యూల్ సిస్టమ్‌లో ‘చైన్ రియాక్షన్’కి కారణమవుతుంది. దీంతో విమానయాన సంస్థకు భారీగా నష్టం వాటిల్లితుంది
1500 కోట్ల నష్టం
ఒక్కో విమానంలో దాదాపు 180 మంది ప్రయాణికులు ఉన్నారని అంటే రూ.1500 కోట్ల నష్టం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు, 500 కంటే ఎక్కువ విమానాలకు బెదిరింపులు వచ్చాయి.. దాదాపు రెండు వేల విమానాలు ప్రభావితమయ్యాయి. ఇప్పుడు ఒక్కో ఫ్లైట్ చైన్ రియాక్షన్ ఏంటో అర్థం చేసుకుంటే.. రూ.మూడు కోట్ల ప్రకారం ఇప్పటివరకు రూ.1500 కోట్ల నష్టం వచ్చింది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Fake bomb threat airline companies are losing crores due to fake call how is it
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com