https://oktelugu.com/

Mahesh With NTR: ఎన్టీఆర్ షోకు మహేష్.. వీళ్ల అల్లరి చూస్తే రెండు కళ్లు చాలవు!

Mahesh With NTR: టాలీవుడ్ అగ్రహీరోలు వాళ్లు.. ఒకరేమో ఆల్ ఇండియా అందగాడు మహేష్ బాబు.. ఇంకొకరమే.. బై బర్త్ లోనే నటనను పుణికిపుచ్చుకున్న ఎన్టీఆర్ వారసుడు జూ.ఎన్టీఆర్. వీరిద్దరి మధ్య అనుబంధం ఈనాటిది కాదు.. ఆ బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. మహేష్ సినిమాకు ఆ మధ్య ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మహేష్ ను మించిన అందగాడు లేడన్నారు. ఇక యాక్టింగ్ లో ఎన్టీఆర్ కొట్టే మొగాడు లేడంటూ మహేష్ ప్రశంసించాడు. ఇద్దరూ అన్నాదమ్ముళ్లా కలిసిపోతారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2021 / 02:04 PM IST
    Follow us on

    Mahesh With NTR: టాలీవుడ్ అగ్రహీరోలు వాళ్లు.. ఒకరేమో ఆల్ ఇండియా అందగాడు మహేష్ బాబు.. ఇంకొకరమే.. బై బర్త్ లోనే నటనను పుణికిపుచ్చుకున్న ఎన్టీఆర్ వారసుడు జూ.ఎన్టీఆర్. వీరిద్దరి మధ్య అనుబంధం ఈనాటిది కాదు.. ఆ బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. మహేష్ సినిమాకు ఆ మధ్య ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మహేష్ ను మించిన అందగాడు లేడన్నారు. ఇక యాక్టింగ్ లో ఎన్టీఆర్ కొట్టే మొగాడు లేడంటూ మహేష్ ప్రశంసించాడు.

    ఇద్దరూ అన్నాదమ్ముళ్లా కలిసిపోతారు. మరి వీరిద్దరూ ఒకే చోట చేరితే.. సందడి చేస్తే.. ఆ అల్లరి మామూలుగా ఉండదు. ఇప్పుడు అదే జరిగింది. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.

    ‘వెల్ కం మహేష్ అన్నా’ అని జూనియర్ ఎన్టీఆర్ ప్రేమగా పిలవడం.. దానికి మహేష్ అంతే ప్రేమగా జూనియర్ ఎన్టీఆర్ ను హగ్ చేసుకోవడంతో ఈ ఇద్దరి అభిమానుల కళ్లకు పండగలా మారింది.

    Also Read: Sai Dharam Tej: యాక్సిడెంట్ తర్వాత మొదటిసారిగా మీడియా ముందుకు రానున్న మెగా హీరో..!

    హాట్ సీట్ లో మహేష్ బాబు కూర్చోగానే.. దీపావళి చిచ్చుబుడ్లు మొత్తం చూట్టు వెలిగాయి. దీంతో మహేష్ బాబు ఉబ్బితబ్బిబ్బై అదిరిపోయింది సెటప్ అంటూ కొనియాడారు. దీనికి ‘నా రాజా’ అంటూ మహేష్ ను ఆటపట్టించాడు.

    ఇక ప్రశ్నలకు ఇటు తిప్పి ఇటు తిప్పి అడగడం దేనికంటూ మహేష్ ప్రశ్నించగా.. సరదాగా అంటూ ఎన్టీఆర్ కామెడీ చేశారు. దీనికి నీకంటే ‘మీ గురువు గారే’ బెటర్ అని పంచ్ వేస్తాడు మహేష్ . ఇలా సరదా సరదాగా సాగిన ఈ షో త్వరలోనే ప్రసారం కానుంది. దానికోసం ఇద్దరు హీరోల అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

    Also Read: BigBoss: ‘బిగ్​బాస్’​ హోస్ట్​గా శ్రుతి హాసన్​.. కారణం ఇదేనా?

    ntr mahesh

    వీడియో..