https://oktelugu.com/

Team India: టీమిండియా కొత్త కెప్టెన్ పై కోటి ఆశలు.. నెరవేరుస్తాడా?

Team India: టీమిండియా కప్పులు లేక వెలవెలబోతోంది. వన్డే ప్రపంచ కప్ గెలిచి పదేళ్లు దాటగా టీ 20 ప్రపంచ కప్ చేజిక్కించుకుని 14 ఏళ్లు దాటిపోయింది. దీంతో టీమిండియాపై విమర్శలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ ను సైతం మార్చారు. రోహిత్ శర్మ కు కెప్టెన్సీ ఇవ్వడంతో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. కానీ కప్పు ముచ్చట మాత్రం తీరడం లేదు. ఈ క్రమంలో టీమిండియా ఎప్పుడు కప్పు […]

Written By:
  • Srinivas
  • , Updated On : November 23, 2021 / 02:09 PM IST
    Follow us on

    Team India: టీమిండియా కప్పులు లేక వెలవెలబోతోంది. వన్డే ప్రపంచ కప్ గెలిచి పదేళ్లు దాటగా టీ 20 ప్రపంచ కప్ చేజిక్కించుకుని 14 ఏళ్లు దాటిపోయింది. దీంతో టీమిండియాపై విమర్శలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ ను సైతం మార్చారు. రోహిత్ శర్మ కు కెప్టెన్సీ ఇవ్వడంతో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. కానీ కప్పు ముచ్చట మాత్రం తీరడం లేదు. ఈ క్రమంలో టీమిండియా ఎప్పుడు కప్పు గెలుస్తుందోననే బెంగ అభిమానుల్లో పట్టుకుంది.

    రోహిత్ శర్మలో నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసి తానేమిటో నిరూపించుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇదివరకే ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ సారధిగా ఐదు టైటిళ్లు అందించిన ఘనత ఉంది. దీంతో టీమిండియాను సమర్థవంతంగా నడిపించగలడనే నమ్మకం అందరిలో వ్యక్తమవుతోంది.

    టీ 20 మ్యాచుల్లో కూడా రోహిత్ శర్మ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రోహిత్ పై అభిమానులకు ఆశలు భారీగానే ఉన్నాయి. నాయకత్వ లక్షణాలతో జట్టును ముందుకు నడిపించే సత్తా ఉన్నవాడిగానే గుర్తిస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో దేశం గర్వించేలా కప్పులు గెలవాల్సిన బాధ్యత కూడా ఉందని చెబుతున్నారు. దీని కోసం అతడు తన మెలకువలు మెరుగుపరచుకుని టీమిండియాను సమర్థవంతంగా నడిపించాలని ఆశిస్తున్నారు.

    రోహిత్ శర్మ జట్టులోని ఆటగాళ్లలో త్వరగా కలిసిపోతాడని తెలుస్తోంది. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరిని కలుపుకుని పోవడం అతడి నైజం. జట్టు ప్రయోజనాల కోసం ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి వెనకాడడు. ఆటగాళ్ల సేవలు సమర్థవంతంగా వినియోగించుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించేందుకు సరైన ప్రణాళికలు రూపొందిస్తాడనే విశ్వాసం అందరిలో నెలకొంది.

    Also Read: పంత్ పై రోహిత్ కు ఎందుకు కోపమొచ్చింది?

    విరాట్ కోహ్లికి మాత్రం అదృష్టం కలిసి రాలేదు. కప్ గెలవని ఆటగాడిగా అతడికి రికార్డు మాత్రం మిగిలింది. దీంతో టీమిండియాకు కూడా చేదు అనుభవమే. దీంతో రోహిత్ శర్మపై అందరికి ఆశలు భారీగానే ఉన్నాయి. రోహిత్ కచ్చితంగా కప్ తీసుకొస్తాడనే నమ్మకం అందరిలో వ్యక్తమవుతోంది. ఏదేమైనా అదృష్టం కూడా కలిసి రావాలి. అది కోహ్లికి ఏ మాత్రం సహకరించలేదు. దీంతోనే టీమిండియా ఏ కప్ గెలవలేకపోయిదని తెలుస్తోంది.

    Also Read: Rohit vs Kohli: రోహిత్.. కోహ్లి.. ఎవరిది బెస్ట్ కెప్టెన్సీ..? భారత కెప్టెన్ గా ఎవరు బెటర్..? సోషల్ మీడియాలో రచ్చ

    Tags