
Manas Romance : ఇప్పుడు సోషల్ మీడియా రోజులు. ఓవర్ నైట్‌లో ఫేమస్ అయ్యే రోజులు కూడా.. దీనికి తోడు టీవీ చానెళ్లు అలాంటివారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అవకాశాలు కూడా ఇస్తున్నాయి. పైగా ప్రత్యేకంగా నిర్వహించే షో ల్లో వాళ్లతో స్కిట్స్ వేయిస్తున్నాయి. ఈ విధానానకి మొదట ఈటీవీ నాంది పలకగా..దానిని మా టీవీ, జీ టీవీ ఫాలో అవుతున్నాయి. అయితే ఇటువంటి షో ల్లో కంటెంట్ ఉంటేనే జనాలు మెచ్చుతున్నారు. టీఆర్‌పీ రేటింగ్స్ పెరిగేందుకు కారణమవుతున్నారు. అయితే ఈ టీఆర్‌పీ రేటింగ్స్ మాయలో పడి టీవీ చానెళ్లు పలు విన్యాసాలు చేస్తున్నాయి. ఈ విన్యాసాల్లో ఈ టీవీ ఎప్పుడైనా ముందుంటుంది. మరీ ముఖ్యంగా మల్లె మాల చేతిలోకి వెళ్లిన తర్వాత ఆ బూతు డోసు పెరిగింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ.. ఇలా ఏది చూసుకున్నా న బూతో న భవిష్యత్.
-రెండో స్థానం కోసం..
వాస్తవానికి ఈటీవీని నిలబెడుతున్నవి ఆ జబర్దస్త్, ఢీ మాత్రమే. కానీ ఇందులో నాణ్యమైన కంటెంట్ లేకపోవడంతో ఆ షోలను మా టీవీ కొట్టేసింది. బిగ్ బాస్ జోడీ పేరుతో ఢీ లాంటి డ్యాన్స్ షో నిర్వహిస్తోంది. ఇందులో కంటెస్టెట్లు రెచ్చిపోయేలా డ్యాన్స్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో తన షోలను తిరిగి నెలబెట్టుకునేందుకు, తన స్థానాన్ని మెరుగు పరుచుకునేందుకు ఈటీవీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగానే హోలీ సందర్భంగా గుండెజారి గల్లంతయ్యిందే అనే పేరుతో ప్రత్యేకమైన షో చేసింది. దీనికి సంబంధించి ప్రోమో ఒకటి విడుదలయింది. అందులో హైపర్ ఆది స్కిట్స్, సౌమ్యా రావు, వర్ష ప్రత్యేకమైన పాటలు.. మొత్తానికి ఫుల్ స్టఫ్‌డ్ మీల్ లాగా రూపొందించనట్టు ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది.
-మానస్ ఏంటయ్యా ఆ కామం
ఇక ఈ ప్రోమోలో చాలా ఇంట్రస్ట్‌గా అనిపించింది మానస్ సాంగ్. ‘అమిగోస్’లో చిత్రంలో ‘ఎన్నో రాత్రులు’ అనే పాటకు చేసిన డ్యాన్స్ అదిరిపోయింది. ముఖ్యంగా అతడి ఎక్స్‌ప్రెషన్స్ సూపర్‌గా ఉన్నాయి. గత కొంత కాలం నుంచి మానస్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. బిగ్‌బాస్ షో తర్వాత అతడికి మంచి డిమాండ్ ఏర్పడింది. బిగ్ బాస్ తర్వాత శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో విష్ణుప్రియతో కలిసి చేసిన జరి జరి పంచె కట్టి పాట అతడిలో రొమాంటిక్ యాంగిల్ చూపింది. ఇదే ఊపులో స్టార్ మా లో ఓ సీరియల్‌లో చేస్తున్నాడు. ఆ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీలో విష్ణుప్రియతో కలిసి మెల్లగా కరగని రెండు మనసుల దూరం అనే పాటలో రెచ్చిపోయాడు. తాజాగా ఈటీవీ గుండెజారి గల్లంతయ్యిందే ప్రోమో విడుదలయిన నేపథ్యంలో ‘ఎన్నోరాత్రులు అనే పాటలో కూడా కామాన్ని కళ్ల నిండా ఒలికించాడు. అంతే కాదు గుండెజారి గల్లంతయ్యిందేకొరుక్కుతినేలా చూస్తున్నాడని’ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.