
‘Selfie’ collections : ఈమధ్య కాలంలో రీమేక్ అంటే ఆడియన్స్ కి చాలా లోకువ అయిపోయింది.స్టార్ హీరోలను సైతం ఆడియన్స్ అసలు పట్టించుకోలేదు.రీమేక్స్ అనేది ఏ ఇండస్ట్రీ కి కూడా కొత్త కాదు.సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుండి రీమేక్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి.కానీ ఇప్పుడు రీమేక్ సినిమాలను ఆడియన్స్ ఈ రేంజ్ లో రిజెక్ట్ చెయ్యడానికి కారణం ఓటీటీ..కరోనా లాక్ డౌన్ సమయం లో మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ పని లెకపొయ్యేసరికీ ఓటీటీ లో రోజుకో సినిమా చూసుకుంటూ ఉండేవాళ్ళు.
అలా భాషతో సంబంధం లేకుండా అన్నీ సినిమాలను చూసేసారు.దానికి తోడు ఇప్పుడు ఏ కొత్త సినిమా అయినా, విడుదలైన 30 రోజులకే ఓటీటీ లో విడుదల అయిపోతున్నాయి.అందుకే థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ సంఖ్య బాగా తగ్గిపోయింది.పైగా ఇప్పుడు మన ఇండియన్ సినిమా పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ రేంజ్ కి ఎదిగింది, అందుకే రీమేక్ అంటే ఈ రేంజ్ వ్యతిరేకత ఆడియన్స్ లో నెలకొంది.
ఇప్పుడు రీసెంట్ గా బాలీవుడ్ బడా హీరో అక్షయ్ కుమార్ మలయాళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే సినిమాని ‘సెల్ఫీ’ అనే పేరు తో రీమేక్ చేసాడు.పబ్లిసిటీ కనివిని ఎరుగని రేంజ్ లో చేసిన ఫలితం లేకుండా పోయింది.క్రేజ్ రప్పించడం కోసం ఏమేమి చెయ్యాలో అన్నీ చేసాడు.రీసెంట్ ‘సీతారామం’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద హిట్ కొట్టిన మృణాల్ ఠాకూర్ ని హీరోయిన్ గా పెట్టుకున్నాడు..145 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ కూడా ఈ సినిమాకోసం పెట్టారు.
కానీ జనాలు ఏమాత్రం కూడా ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు.మొదటి రోజు కేవలం రెండు కోట్ల రూపాయిల ఓపెనింగ్ ని రాబట్టిన ఈ సినిమా, మూడు రోజులకు కలిపి కేవలం 6 కోట్ల రూపాయిల వసూళ్లను మాత్రమే రాబట్టింది.ఒక స్టార్ హీరో కి ఇలాంటి డిజాస్టర్ ఫ్లాప్ గడిచిన మూడేళ్ళలో ఎవరికీ పడలేదు.అలాంటి దరిద్రంగా రికార్డుని మూటగట్టుకున్నాడు అక్షయ్ కుమార్.