Esha Rebba : ఇండస్ట్రీ లో రోజుకొక హీరోయిన్ ఎంట్రీ ఇస్తు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంటారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటే మిగిలిన చాలామంది ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన ‘అంతకుముందు ఆ తర్వాత’ అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ‘ఈషా రెబ్బ’ నటి గా మంచి గుర్తింపు పొందింది. ఇక ఈ క్రమం లో ఈషా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పది సంవత్సరాల కాలం పాటు ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతుంది.
ఇక ఇండస్ట్రీ లో ఈమెకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక అందులో భాగంగానే అక్కినేని సుమంత్ తో సుబ్రహ్మణ్యపురం అనే సినిమాలో నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది…
ఇక ఇలాంటి ఈషా రెబ్బ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక అందులో భాగంగానే ఆమె ఎప్పుడు ఫోటో షూట్ చేసిన కూడా తన హాట్ హాట్ అందాలను అభిమానులు చూసే విధంగా ఆ ఫోటోలని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక వాటిని చూసిన అభిమానులు రకరకాలుగా కామెంట్లైతే చేస్తూ ఉంటారు. కొంతమంది ఈషా రెబ్బ మంచి హీరోయిన్ అయినప్పటికీ ఆమెకు మాత్రం పెద్ద సినిమాలు పడడం లేదని కామెంట్ చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం ఈషా తన పరువపు అందాలతో మన మతులు పోగొడుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక మొత్తానికైతే ఈషా కుర్రాలని తన అందంతో కట్టిపడేస్తుందనే చెప్పాలి. ఇక మరికొందరు మాత్రం ఈషా రెబ్బ కి పెద్ద సినిమాల్లో ఆఫర్స్ రావడానికే తను ఇలాంటి హాట్ హాట్ పిక్స్ ని పోస్ట్ చేస్తుంది అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే సినిమాల్లో నటించిన, నటించకపోయిన సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ తన అభిమానులను ఇలా పలకరిస్తూ వాళ్ళని ఆనందంగా ఉంచుతుంది…