Esha Rebba : సుమ అడ్డా షోకి గెస్ట్ గా వచ్చిన ఈషా రెబ్బా బాంబు పేల్చారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఎవరికీ తెలియని రహస్యం బ్రేక్ చేసింది. ఈషా రెబ్బా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ మాయాబజార్ ఫర్ సేల్. నరేష్, ఝాన్సీ, నవదీప్, ఈషా రెబ్బా, రవి వర్మతో పాటు పలువురు నటించారు. జీ 5లో ఈ కామెడీ రొమాంటిక్ సిరీస్ జులై 14 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఈషా రెబ్బా, బిగ్ బాస్ జెస్సీ, నటుడు రవి వర్మ, దర్శకురాలు గౌతమి చల్లాగుల్లా సుమ అడ్డా షోలో పాల్గొన్నారు.
ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. తొందరగా పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది? అని ఈషాను సుమ అడిగారు. దానికి ఈషా రెబ్బా ‘తొందరపడ్డప్పుడు’ అని షాకింగ్ సమాధానం చెప్పింది. అనంతరం ప్రేమ ప్రస్తావన వచ్చింది. ఈషా నీ ప్రేమ గురించి చెప్పు? అని సుమ అడిగారు. ఈ ప్రశ్నకు నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారని ఈషా షాక్ ఇచ్చింది. దాంతో… సుమతో పాటు షోలో ఉన్నవారందరి ముఖాలు వెలవెలబోయాయి.
ఆ పిల్లల నాన్న ఎక్కడ ఉంటాడని సుమ అడిగారు. దానికి ఈషా ఏదో సమాధానం చెప్పారు. అసలు పెళ్లి కానీ ఈషాకు పిల్లలేంటి? వాళ్ళ నాన్న ఎవరు? అనే విషయాలు తెలియాలంటే సుమ అడ్డా నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. కాగా సిల్వర్ స్క్రీన్ పై ఈషా జోరు తగ్గింది. అయితే డిజిటల్ కంటెంట్ లో ఆఫర్స్ వస్తున్నాయి. మాయాబజార్ ఫర్ సేల్ స్ట్రీమ్ అవుతుంది. దయ అనే మరో సిరీస్ త్వరలో స్ట్రీమ్ కానుంది.
దయ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. నటుడు చక్రవర్తి ప్రధాన పాత్ర చేశారు. ప్రోమోలు ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈషా రెబ్బా తమిళంలో ఒక చిత్రం ప్రకటించారు. విక్రమ్ ప్రభు హీరోగా థ్రిల్లర్ తెరకెక్కుతుంది. ఈ మూవీలో ఈషా పోలీస్ గా కనిపించనున్నారని సమాచారం. కాగా టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెకు ఆఫర్స్ ఇవ్వడం లేదనే అసహనం ఆమెలో ఉంది. ఇటీవల ఈ మేరకు కామెంట్స్ చేశారు.