RGV Setaire: సోషల్ మీడియా ఐకాన్ రాంగోపాల్ వర్మ నెట్టింటిలో మరోసారి వైరల్ గా మారాడు. నిత్యం సంచలనాల పోస్టులు పెట్టే ఈ డైరెక్టర్ తాజాగా మరో వీడియో షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారడంతో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారనని చెబుతున్న వ్యాఖ్యలతో ఉన్న ఈ వీడియోను ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టడం ఆసక్తిగా మారింది. అయితే ఇటీవల ఆర్జీవి కొండా సురేఖ దంపతుల లైఫో స్టోరీ ఆధారంగా ‘కొండా’ అనే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. ఈ సీనిమాలోనూ ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు పెట్టాడు. తాజాగా వర్జినల్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
వరంగల్ జిల్లాలో కొండా సురేఖ దంపతలు అంటే తెలియని వారుండరు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వీరు ఆ తరువాత టీఆర్ఎస్లోకి చేరారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక తిరిగి సొంత గూటికే చేరుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లోనే కొనసాగుతున్న వీరి లైఫ్ స్టోరీ ఆధారంగా ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ‘కొండా’ అనే సినిమాను తీశాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో ‘ఒకే తల్లికి పుట్టాను’ అనే డైలాగ్ ను సుధాకర్ అనే పాత్ర చేసిన పృథ్వీరాజ్ తో చెప్పించారు.
అయితే ఈ డైలాగ్ ప్రస్తుత తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయార్ ఒకప్పుడు చేసిన వ్యాఖ్యలేనని ఆర్జీవి పరోక్షంగా చెబుతున్నాడు. ఇందులో భాగంగా ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీలో ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తాజాగా ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు. ఇందులో ఎర్రబెల్లి దయాకర్ రావు ‘కన్నతల్లి అసోంటి తెలుగుదేశం పార్టీని నమ్మకున్నా.. నేనొక్కటే తల్లిని నమ్ముకున్నా’ అని పదే చెబుతారు. అయతే ఈ వీడియోను షేర్ చేసిన ఆర్జీవి ‘అన్ని సార్లు రిపీట్ గా చెప్తా వుంటే నిజం కాదేమో అని అనిపిస్తుంది’ అని కామెంట్ పెట్టాడు. అంతేకాకుండా పూర్తి వివరాలకు ‘కొండా’ ట్రైలర్ ను చూడాలని చెప్పాడు.
ఈ వీడియోను మంగళవారం ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టగా.. కొద్ది సమయానికే వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ వీడియోను చూసిన వారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోకు కొండా అభిమానులు లైక్ కొడుతుండగా వ్యతిరేకంగా ఉన్న వారు మాత్రం రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఇప్పుడే ఎందుకు షేర్ చేశాడో మాత్రం ఆర్జీవి తెలపలేదు. కానీ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇలా చేశాడని కొందరు అంటున్నారు. ఏదీ ఏమైనా తెలంగాణ మంత్రికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు ట్విట్టర్ ప్రపంచంలో దుమారం లేపుతోంది.
వీడియో
https://twitter.com/RGVzoomin/status/1488573090368192512?s=20&t=q3WUZh2ZgB85gXWNYuvAbA