Honey Trop Minister: ఆయనో రాష్ట్రమంత్రి.. ఆయనకు వలవేసింది ఓ మహిళ.. నగ్నంగా బాత్ రూమ్ వీడియోతో ఆకర్షించింది. కానీ చివరకు అది బెడిసికొట్టింది. బ్లాక్ మెయిల్ చేద్దామనుకున్న ఈ మోడల్ తోపాటు వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రికే హానీ ట్రాప్ విసిరిన ఈ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది.

రాజస్థాన్ మంత్రికే ఓ మోడల్ టెండర్ వేసింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఆ రాష్ట్ర మంత్రి రాంలాల్జాట్ ను హానీ ట్రాప్ చేయడానికి ముగ్గురు ప్రయత్నించారు. దీని కోసం ఒక మోడల్ ను బ్లాక్ మెయిల్ చేశారు. రెండు రోజుల కిందట ఆ మహిళ హోటల్ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.
2021 అక్టోబర్ లో ఆ మహిళ మోడలింగ్ కోసం ఉదయ్ పూర్ వెళ్లింది. అక్కడే అక్షిత్, దీపాలీతో మోడల్ కు పరిచయం ఏర్పడింది. దీపాలీ ఆ మోడల్ ను సంప్రదించి అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోల సాకుతో మంత్రికి ఫైల్ ను తీసుకెళ్లమని బ్లాక్ మెయిల్ చేశారు. నిందితుడైన అక్షిత్ అప్పటికే హానీ ట్రాప్ ముఠాను నడుపుతున్నాడు. ఈసారి మంత్రిని ట్రాక్ చేసి హానీ ట్రాప్ ద్వారా బ్లాక్ మెయిల్ చేయాలని అక్షిత్ ప్లాన్ చేశాడు.
ఈ క్రమంలోనే నిందితులు మోడల్ ను శనివారం భిల్వారాకు తీసుకెళ్లి మంత్రితో పడుకోమని బలవంతం చేశారు. అయితే ఆమె భిల్వారా నుంచి పారిపోయి జోద్ పూర్ కు తిరిగి వచ్చింది. జోధ్ పూర్ కు చేరగానే ఆమె మొత్తం విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేసింది. మోడల్ తన ఇంటికి వెళ్లకుండా ఒక హోటల్ కు వెళ్లి పై అంతస్తు నుంచి దూకింది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. ఆస్పత్రి పాలైంది.
మోడల్ నగ్నంగా స్నానం చేస్తున్న వీడియోను రికార్డ్ చేసి ఆ వీడియోతో మంత్రిని బ్లాక్ మెయిల్ చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడు. వాళ్లకు సంబంధించిన కొన్ని ఫైళ్లను క్లియర్ చేయలేదని ఈ తంతంగం నడిపారు.
ఈ క్రమంలోనే రాజస్థాన్ మంత్రి రాంలాల్ జాట్ ను హానీ ట్రాప్ చేసేందుకు ఈ మోడల్ ద్వారా ప్రయత్నించారు. ఆమెతో బాత్రూంలో నగ్నంగా వీడియోలు తీసి మంత్రికి ఎరవేశారు. అయితే ఇదే ముందే పసిగట్టి పోలీసులకు మంత్రి సమాచారం ఇవ్వడంతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.