https://oktelugu.com/

Eluru : ప్రేమికుడు పిలిస్తే అతడి ఇంటికి వెళ్ళింది..తీరా అతడి వ్యవహారాన్ని చూసి..

Eluru : ప్రేమంటే తప్పు ఒప్పులతో నిమిత్తం లేకుండా ఎదుటివారిని యధాతధంగా అంగీకరించడం.. ప్రస్తుత తరానికి ఇవేవీ తెలియడం లేదు. పైగా వయసు వేడిలో చేయరాని తప్పులు చేస్తున్నారు. సమాజం ముందు తలదించుకుంటున్నారు. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు పట్టణంలో జరిగింది. ఈ సంఘటన ప్రస్తుత యువతలో పెరిగిపోతున్న పైశాచికత్వాన్ని చూపించింది. ఏలూరు పట్టణంలో ఇంజనీరింగ్ విద్యార్థినిని గదిలో బంధించిన ప్రేమికుడు చిత్రహింసలకు గురి చేశాడు. ఆ యువతి కాళ్లు, చేతుల పై వేడివేడి నూనె పోసి […]

Written By:
  • Rocky
  • , Updated On : April 23, 2023 / 06:29 PM IST
    Follow us on

    Eluru : ప్రేమంటే తప్పు ఒప్పులతో నిమిత్తం లేకుండా ఎదుటివారిని యధాతధంగా అంగీకరించడం.. ప్రస్తుత తరానికి ఇవేవీ తెలియడం లేదు. పైగా వయసు వేడిలో చేయరాని తప్పులు చేస్తున్నారు. సమాజం ముందు తలదించుకుంటున్నారు. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు పట్టణంలో జరిగింది. ఈ సంఘటన ప్రస్తుత యువతలో పెరిగిపోతున్న పైశాచికత్వాన్ని చూపించింది.

    ఏలూరు పట్టణంలో ఇంజనీరింగ్ విద్యార్థినిని గదిలో బంధించిన ప్రేమికుడు చిత్రహింసలకు గురి చేశాడు. ఆ యువతి కాళ్లు, చేతుల పై వేడివేడి నూనె పోసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో గాయపడిన యువతి ఆదివారం తెల్లవారుజామున తప్పించుకుని వచ్చింది.. జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    ఏలూరులోని జేఎన్టీయూలో శనివారపు పేటకు చెందిన ఓ యువతీ బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. శనివారపుపేటకు సమీపంలోనే దుగ్గిరాలకు చెందిన సదర్ల అనుదీప్ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆ యువతిని ఉచ్చు లోకి లాగాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఎలాగో పెళ్లి చేసుకుంటా అని చెబుతున్నాడు కాబట్టి ఆ అమ్మాయి కూడా అతడికి లొంగిపోయింది.

    ఇదంతా జరుగుతుండగానే ఐదు రోజుల క్రితం ఆ విద్యార్థినిని దుగ్గిరాలలోని తన ఇంటికి తీసుకొచ్చాడు. రోజూ రాత్రి యువతిని చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభించాడు.ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. శనివారం ఆ యువతిని ఉరివేసి చంపేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె తప్పించుకుని బయటికి వచ్చేసింది. జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాధిత యువతి చెప్పిన వివరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.. నిందితుడు అనుదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు బానిస అయిన అనుదీప్ చాలా ఉంది అమ్మాయిల్ని ప్రేమ పేరుతో ఇదేవిధంగా వంచించాడని స్థానికులు చెబుతున్నారు.. వారందరినీ శారీరకంగా లొంగదీసుకుని… తర్వాత చిత్రహింసలకు గురి చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మాయిని కూడా అదే విధంగా చేయబోయాడు. అతగాడి ప్రే మోన్మాదాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆ అమ్మాయి.. తేరుకుని తన తల్లిదండ్రులకు చెప్పింది.. వారు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ప్రస్తుతం ఆ ఉన్మాది ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

    Tags