Heroines Health Problems: పైకి అందంగా ఆర్భాటంగా కనిపించే హీరోయిన్స్ జీవితాల వెనుక కనిపించని కోణాలెన్నో. ఒక టైం టేబుల్ అంటూ లేని ప్రొఫెషనల్ వాళ్ళది. ఈ క్రమంలో తరచుగా అనార్యోగం బారిన పడుతూ ఉంటారు. అసమయ భోజనాలు, తీరిక లేని షెడ్యూల్స్, నిద్రలేమి వారిని మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురి చేస్తాయి. ఈ పరిస్థితి ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో చాలా మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు.

సమంత ఇటీవల తనకు మయోసైటిస్ సోకినట్లు వెల్లడించారు. ఇది కండరాల రుగ్మత. మయోసైటిస్ సోకినవారి కండరాలు వాపుకు గురవుతాయి. త్వరగా అలసిపోవడం, విపరీతమైన నొప్పులు వంటి లక్షణాలతో ఇబ్బంది పడతారు. సాధారణంగా చిన్న పిల్లలకు లేదా వృద్ధులు సోకే ఈ వ్యాధి యంగ్ ఏజ్ లో ఉన్న సమంతకు సోకడం దురదృష్టకరం. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటున్నారు. సమంత కొన్ని చిత్రాలు వదులుకోవాల్సి వచ్చింది. షూటింగ్ దశలో ఉన్న ఖుషి వాయిదా పడింది.
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార కొన్నేళ్ల క్రితం అరుదైన చర్మ వ్యాధికి గురయ్యారు. చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆ వ్యాధి కారణంగా కొన్నాళ్లు ఆమె షూటింగ్స్ కి బ్రేక్ తీసుకున్నారు. ఇక 2022లో ప్రియుడు విగ్నేష్ శివన్ ని నయనతార వివాహం చేసుకున్నారు. సరోగసీ పద్ధతిలో కవల అబ్బాయిలకు పేరెంట్స్ అయ్యారు.
గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలారు. టాప్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఇలియానా గతంలో బాడీ డిస్మార్ఫియా అనే మానసిక వ్యాధితో బాధ పడ్డారు. ఈ సైకలాజికల్ డిజాస్టర్ ఉన్నవారు… తమ శరీరం అందంగా లేదని ఆత్మన్యూనతతో బాధపడతారు. బాలీవుడ్ కి వెళ్లిన ఇలియానా కెరీర్ నాశనం చేసుకున్నారు.

స్టార్ కిడ్ శృతి హాసన్ తాను హార్మోన్స్ ఇన్ బాలన్స్ కి గురైనట్లు వెల్లడించారు. ఆ కారణంగా ఆమె అనేక శారీరక సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్నప్పటికీ శృతి ఈ అరుదైన వ్యాధి బారిన పడినట్లు తెలియజేశారు. ఆమె ట్రీట్మెంట్ తర్వాత తిరిగి కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ చిత్రాల్లో నటిస్తున్నారు.
పూనమ్ కౌర్ ఇటీవల తాను ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధి బారిన పడ్డట్టు స్వయంగా తెలియజేశారు. ఫైబ్రోమయాల్జియా సోకినవారు త్వరగా అలసిపోవడం, కండరాలు పట్టివేయడంతో పాటు పలు ఇబ్బందులు ఎదుర్కొంటారు.