Spacex Rocket Ionosphere: వెర్రి వెయ్యి తలలు వేస్తే ఏం చేస్తాం? ఈ ఎర్రగడ్డకో మరో హాస్పిటల్ కో వెళ్తాం. కానీ అదే ఆగర్భ శ్రీమంతుడు ఎలన్ మస్క్ మాత్రం తన వెర్రితనాన్ని ప్రపంచం మీద రుద్దుతున్నాడు. దీనివల్ల సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతున్నది. ఒకవైపు ఎక్స్ గా పేరు మార్చేసి మరీ ట్విట్టర్ ను మస్క్ అతలాకుతలం చేసేసాడు. ఇప్పుడు ఏకంగా ఎక్స్ వీడియోస్ అనే బూతు హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లోకి తెచ్చేసాడు. ఇదేం దరిద్రం రా బాబూ అనుకుంటుంటే మస్క్ కు చెందిన మరో ఎక్స్ కంపెనీ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
పెద్ద రంధ్రం చేసింది
ఎలన్ మస్క్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ రాకెట్.. అయనో స్పియర్ కు పెద్ద రంద్రం చేసేసింది. వాతావరణంలో పైకి వెళ్లే కొద్దీ పోరలను “ట్రోపో, స్ట్రాటో, మీసో, తెర్మో(ఐనో),ఎక్సో, మాగ్నెటో స్పీయర్ గా విభజించిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో ఆయానో స్పీయర్ కు ఎలన్ మస్క్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ రాకెట్ పెద్ద రంధ్రం చేసింది. జూలై 19న ఈ ప్రయోగం జరిగింది. దీనివల్ల భారీ ఉపద్రవమే జరిగింది. జూలై 19న కాలిఫోర్నియాలోని వన్ డెన్ బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఫాల్కన్ _9 రాకెట్ ప్రయోగం జరిగింది. ఈ క్రమంలో ఆయానో స్పియర్ పొరను రాకెట్ చీల్చేయడం స్పష్టంగా కనిపించిందని, ఆ సమయంలో ఎర్రని రంగు వెలుతురు ఉద్భవించిందని బోస్టన్ యూనివర్సిటీ కి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జెఫ్ బౌమ్ గార్డెనర్ తెలిపారు. రాకెట్ నుంచి ఇంధనం మండినప్పుడు ఇది సాధారణంగా జరిగేదే. అయినా అత్యంత శక్తివంతమైన ఫాల్కన్ రాకెట్ తో అయానో స్పీయర్ కు జరిగిన డ్యామేజ్ ఎక్కువే అని ఆయన అంటున్నారు. అయానో స్పీయర్ .. మొత్తం ఆయాన్ లతో ఆవరించి ఉంటుంది. సోలార్ ప్లాస్మా ఆయాన్ లతో చర్య జరిపి ఆకాశంలో అద్భుతమైన రంగులు ఆవిష్కృతమయ్యేందుకు ఇదే కారణం అవుతుంది. భూ అయస్కాంత తుఫాన్లకూ ఇదే కారణం.
భవిష్యత్ లో నష్టం తప్పదా?
ఇక వాతావరణ పొరల్లో అయానో స్పియర్ కూడా ముఖ్యమైనది.. ఎందుకంటే ఇది కమ్యూనికేషన్, నావిగేషన్ కోసం ఉపయోగించే రేడియో తరంగాలను ప్రతిబింబిస్తుంది. అందులో మార్పులకు కూడా కారణమవుతుంది. ఒకవేళ దీనికి ఏదైనా డ్యామేజ్ జరిగితే అది జిపిఎస్, నావిగేషన్ సిస్టం మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికి ఇప్పుడు కాకపోయినప్పటికీ భవిష్యత్తులో శక్తివంతమైన రాకెట్ల ప్రయోగాల వల్ల ఇది సంభవిస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్రైవేట్ కంపెనీలతో అడ్డగోలుగా రాకెట్ ప్రయోగాలు చేస్తున్న స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీలతో వాతావరణానికి పెను నష్టం తప్పదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
ఇదే తొలిసారి కాదు
అయానో స్పియర్ కు స్పేస్ ఎక్స్ రాకెట్లు నష్టం చేయడం ఇది తొలిసారి కాదు. 2017 ఆగస్టు 24న జరిగిన ఫాల్కన్ _9 రాకెట్ ప్రయోగం, అలాగే 2022 జూన్ 19న జరిగిన ప్రయోగంలోనూ ఇదే తరహాలో అయానో స్పియర్ కు నష్టం వాటిల్లింది. ఏడాది ఏప్రిల్ 20న స్పేస్ ఎక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద భారీ రాకెట్ ప్రయోగం చేపట్టింది. అయితే అది పేలిపోయింది. వల్ల టెక్సాస్ బేస్ వద్ద భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. దుమ్ము ధూళి ఎగిసిపడి మైళ్ళ దూరం వరకు పర్యావరణానికి నష్టం వాటిల్లింది. అక్కడ జీవజాలంపై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. అయితే ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల స్పేస్ ఎక్స్ భవిష్యత్తులో భారీగా లాభాలు కళ్ల జూస్తుందని ఖగోళ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇదే సమయంలో తన వ్యక్తిగత స్వార్థం కోసం పర్యావరణాన్ని మస్క్ పణంగా పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.