
Twitter Logo: ఉదయం నుంచి ఒకటే చర్చ. ట్విట్టర్ లోగో మారింది మీరు చూశారా అని.. నిజంగానే అనుమానం వచ్చి లోగోను పరీక్షించి చూస్తే మారినట్టు అర్థమైంది.. అదే సమయంలో ఎలన్ మస్క్ మరో తిక్క నిర్ణయం తీసుకున్నాడు అనిపించింది. అసలు తిక్క నిర్ణయాలు తీసుకోవడంలో అతని తర్వాతే ఇంకెవరైనా అనిపించింది. ఎందుకంటే అతడు ఎప్పుడైతే ట్విట్టర్ ను కొనుగోలు చేశాడో అప్పటినుంచి ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూనే ఉన్నాడు. అగర్వాల్ ను పక్కన పెట్టాడు. గద్ద విజయను బయటికి గెంటేశాడు. ఆర్థిక మాంద్యం పేరుతో చాలామంది ఉద్యోగులను తొలగించాడు.. ఇప్పుడు ఏకంగా లోగో మార్చాడు.
ట్విట్టర్ లోగో మార్చుతున్నట్టు గతంలోనే ఎలన్ మస్క్ ఇండికేషన్ ఇచ్చాడు. ట్విట్టర్ సీఈవోగా ఎవరు బాగుంటారని ఆ మధ్య ఒక పోల్ పెట్టాడు. సీఈఓ కుర్చీలో తన పెంపుడు కుక్కను కూర్చో బెట్టి సంచలనానికి నాంది పలికాడు. అప్పట్లో చాలామంది మస్క్ కు ఏమైనా చిప్ దొబ్బిందా అనుకున్నారు. అదే సమయంలో ట్విట్టర్ కు ఇంత మంచి సీఈఓ కంటే నాకు ఎవరూ దొరకలేదని తనకు తానే ముక్తాయింపు ఇచ్చుకున్నాడు.

గతంలో ట్విట్టర్ కు ఒక పిట్ట లోగోలో కనిపించేది. ట్విట్టర్ అంటే ఇంగ్లీష్ లో కూత అని అర్థం వస్తుంది..ఆ లోగో లో పిట్ట కనిపించడంతో దానిని కూసేపిట్టగా అందరూ అభి వర్ణించేవారు. మైక్రో బ్లాగింగ్ విభాగం లో ఈ యాప్