
Margadarsi Case: ” జగన్ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. చందాదారుల్లో లేని భయాలు కలిగిస్తోంది. ఇది ముమ్మాటికి మమ్మల్ని నష్టపరిచే కుట్ర. ఇది సరైన పద్ధతి కాదు. ఆ ఏపీ సీఐడీ ఏడీజీ ఎన్. సంజయ్ మమ్మల్ని బజారుకు లాగుతున్నాడు. ఇది మమ్మల్ని బద్నాం చేసే చర్య” ఇది ఈరోజు ఈనాడు లో కనిపించిన వార్త. ఎదుటివారితో శోకాలు పెట్టించడంలో దిట్టైనా రామోజీరావు.. తాను శోకాలు పెడుతుండటం నిజంగా ఆశ్చర్యకరమే. ఆ ఏపీ సిఐడి ఏడిజి సంజయ్ మీద ఆరోపణలు చేయడం కూడా నిజంగా విశేషమే. ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇదే ఈనాడు ఎలా వార్తలు రాసింది? అప్పటి సిబిఐ జెడి లక్ష్మీనారాయణ తో ఎలాంటి ఇంటర్వ్యూలు తీసుకుంది అనేది తెలుగు నాట ఇప్పటికీ గుర్తుకుంది.
వాస్తవానికి మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో అక్యూ స్డ్_1 గా రామోజీరావును సిఐడి అధికారులు చేర్చారు. గతంలో ఆయనను విచారించారు. ఆయన పెద్ద కోడలు శైలజ ఈ వ్యవహారంలో ఆక్యూ స్డ్ _2 గా ఉన్నారు. ఆమె విచారణ ప్రక్రియ కూడా పూర్తయింది. కానీ పదే పదే తన పేపర్ ద్వారా మార్గదర్శిని వెనకేసుకొస్తున్న రామోజీరావు అసలు విషయాలకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. చిట్ ఫండ్ చట్టం తన సంస్థకు వర్తించదని రామోజీరావు చెబుతుండడం, దానిని శైలజ కూడా వాదిస్తుండడం ఇక్కడ విశేషం. వాస్తవానికి ఆ చట్టాన్ని జగన్ మోహన్ రెడ్డి తీసుకురాలేదు. ఆ చట్టం కాంగ్రెస్ పాలనలో తెరపైకి వచ్చింది. చందాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు రిజర్వ్ బ్యాంకు కఠినమైన నిబంధనలు తీసుకొచ్చింది. ఈ దేశంలో ఉన్న ఎవరైనా కూడా వాటిని పాటించాల్సిందే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్గదర్శిని మూసి వేయమని చెప్పడం లేదు. కార్యకలాపాలు నిలుపుదల చేయమని చెప్పడం లేదు. నిబంధనలు సక్రమంగా పాటించాలని చెబుతోంది. మీ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఇవ్వమని చెబుతోంది. వీటి విషయంలో సక్రమంగా వివరాలు ఇవ్వకుండా మార్గదర్శి గగ్గోలు పెడుతోంది. అయితే తన అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకు అడ్డగోలు వాదనలకు దిగుతోంది.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా మార్గదర్శిమినః మిగతా చిట్ఫండ్ సంస్థల పైన దాడులు జరిగాయి. ఆ కాలంలోనే చార్మినార్ బ్యాంకు మూతపడింది. అగ్రి గోల్డ్ సంస్థ చేతులెత్తేసింది. అదే సమయంలో మార్గదర్శి మీద చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీనికి కారణం ఏమై ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జగన్ హయాంలో మార్గదర్శి మీద దాడులు జరుగుతున్నాయి. అని మిగతా చిట్ఫండ్ సంస్థల ను ఏపీ ప్రభుత్వం ముట్టుకోవడం లేదు. దీనికి కూడా కారణమేమిటో చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక మార్గదర్శి విషయంలో కేంద్ర చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధంగా భారీగా నిధులు మళ్ళించారని సిఐడి అధికారులు చెబుతున్నారు. “బ్రాంచ్ మేనేజర్లకు 500కు మించి చెక్ పవర్ లేనప్పుడు భారీగా నిధుల బదిలీ ఎలా చేశారు? చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టడం ఎం మతవరకు కరెక్ట్? చిట్టిల చందాదారులు పాడిన మొత్తాన్ని ఇవ్వకుండా రసీదు మాత్రమే ఇస్తూ ఐదు శాతం వడ్డీ చెల్లిస్తున్నది నిజం కాదా? చందాదారులకు నగదును ఇవ్వకుండా, మార్గ దర్శి యాజమాన్యం దగ్గరే పెట్టుకోవడం డిపాజిట్ సేకరణ కాదా? చిట్ ఫండ్ కంపెనీలు డిపాజిట్ల సేకరణకు రిజర్వ్ బ్యాంక్ అనుమతించిందా?” ఈ ప్రశ్నలకు మార్గదర్శి సమాధానం చెప్పలేకపోతోంది.
వాస్తవానికి మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పైగా మార్గదర్శి వంటి చిట్ ఫండ్ సంస్థల్లో చీటీలు వేసే వారంతా మధ్యతరగతి వారే. పైసా పైసా కూడ పెట్టి అందులో పొదుపు చేస్తే.. యాజమాన్యం మాత్రం అవసరానికి ఇవ్వడం లేదు. పైగా వడ్డీ పేరుతో చందాదారులను మభ్యపెడుతోంది.. పైగా చీటీ పాడే క్రమంలోనూ రసీదు ఇస్తోంది.. ఇది రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఈ విషయాలపై సిఐడి లోతుగా తవ్వింది కాబట్టే రామోజీరావును కార్నర్ చేయగలిగింది..ఆఫ్ కోర్స్ దీని వెనక జగన్ ఉన్నాడు. రామోజీరావును ఒక ఆట ఆడుకుంటున్నాడు. మరోవైపు తెలంగాణ హైకోర్టు కూడా చేతులెత్తేయడంతో మార్గదర్శిని చెడుగుడు ఆడుకోవాలని జగన్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతున్నది. నిన్న ఏపీ సిఐడి చీఫ్ కూడా అదే అర్థం వచ్చేలా మాట్లాడాడు. చూడాలి ఏమవుతుందో..