Telangana: రైతులు పంట తడికోసం వివిధ మార్గాలపై ఆధారపడతారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే కాలువలు అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్టుల నుంచి నీరు వస్తోంది. ఎక్కువ శాతం రైతులు బావులు, బోర్లపైనే ఆధారపడుతున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమో.. లేక తెలంగాణ వచ్చాక విస్తృతంగా కురుస్తున్న వానల ఫలితమో తెలియదు కానీ చాలా ప్రాంతాల్లో బోర్లు తక్కువ లోతులోనే నీరు ఉబికి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మోటార్లు అవసరం లేకున్నా బోరు పైపుల్లో నుంచి నీరు ఉబికి వస్తుంది. అయితే నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కనీ వినీ ఎరుగని వింత జరిగింది.
ఇక్కడ బోర్ దింపుతుంటే.. అక్కడ బయటికొచ్చింది!
బోర్లు ఇష్టానుసారం వేయడానికి వీలు లేదు. బోర్లు వేయాలంటే రెవెన్యూ, భూగర్భ జలవనరుల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. పక్కపక్కనే బోర్లు వేయడం వలన లోతు తక్కవ ఉన్న బోరులోని నీరంతా లోతు ఎక్కువగా తవ్వే బోరులోకి వెళ్లిపోతోంది. దీంతో తక్కువ లోతు ఉన్న బోరు వట్టిపోతుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో మాత్రం ఒక దగ్గర బోర్ వేస్తుంటే.. మరో దగ్గరి నుంచి నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. గ్రామానికి చెందిన ఓ రైతు తన పంట కోసం బోర్ వేస్తున్న క్రమంలో.. ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఒక దగ్గర కొత్తగా బోర్ వేస్తుంటే.. పక్కనున్న స్థలంలో ఉన్న బోర్ నుంచి నీళ్లు ఎగజిమ్ముతూ బయటకువచ్చాయి. అంతేకాకుండా ఆ నీళ్లతో పాటు ఆ బోర్ పైపులు మోటార్‌తో సహా బయటికి వచ్చాయి. అంతెత్తున నీళ్లతో పాటు పైపులు కూడా బయటకు రాగా.. కొంత ఎత్తుకు వెళ్లిన తర్వాత ఆ పైపులు విరిగి కింద పడిపోయాయి.
Also Read: Ananya Nagella: సర్జరీ చేయించుకొని కెరీర్ ని నాశనం చేసుకున్న ‘వకీల్ సాబ్’ బ్యూటీ అనన్య నాగేళ్ల
పుష్కలంగా నీళ్లు..
తెలంగాణలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఒకప్పుడు పక్కపక్కన బోర్లు వేస్తే రైతులు పరస్పరం ఫిర్యాదు చేసుకునేవారు. కానీ పెరిగిన భూగర్భ జలాల ఫలితంగా ఎవరిపై ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. వాల్టా చట్టాన్ని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా కొల్లాపూర్‌లో కొత్తగా వేస్తున్న బోర్లో నీళ్లు దండిగానే పడ్డాయి. పాతబోరులోనూ ప్రెషర్‌కు నీళ్లు ఎగిసి పడ్డాయి. పాత బోర్‌కు సమీపంలోనే మరో బోర్ వేయటం వల్ల ప్రెషర్‌కు పైపులతో సహా నీళ్లు బయటికి వచ్చినట్టు స్థానికులు భావిస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. గలగల పారేటి గంగమ్మ పంట చేలకు మళ్లిందని కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Dil Raju-Nitin: బీఆర్ఎస్ నుంచి దిల్ రాజు, బీజేపీ నుంచి నితిన్: తెలంగాణ ఎన్నికల్లో సినీ దిగ్గజాలు
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Dynamic groundwater resources of telangana
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com