CM Revanth Reddy: ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాటు చేసింది. సింగరేణి జట్టు తరఫున సీఎం రేవంత్‌రెడ్డి బరిలో దిగారు. మెస్సీ జట్టు తరఫున మెస్సీ ఆడారు. అయితే మ్యార్ తర్వాత మెస్సీ మైదానమంతా తిరిగారు. అభిమానులను పలకరించారు. ఇక ఉప్పల్ స్డేడియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం తన మనుమడిని కూడా తీసుకువచ్చారు. మెస్సీతో కాసేపు ఫుట్‌బాల్ ఆడించారు. దీనిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపడ్డారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి టైం ఉండడం లేదు కానీ, మనుమడితో ఫుట్‌బాల్ ఆడేందుకు మాత్రం తీరిక దొరుకుటుందని ఎద్దేవా చేశారు.
నేను గెస్ట్‌ను మాత్రమే..
కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్పందించారు. తన కుటుంబాన్ని పండుగలు, వినోదాల చుట్టూ తిప్పడం కేసీఆర్ కుటుంబం శైలి మాత్రమేనని, తనవి కాదని స్పష్టం చేశారు. పిల్లల్లో ఫుట్‌బాల్ ఉత్సాహం పెంచాలనే ఉద్దేశంతో మెస్సీ ఈవెంట్‌కు తన మనవడిని తీసుకెళ్లానని రేవంత్ వివరించారు. ఈ కార్యక్రమం పూర్తిగా ప్రైవేట్ ఏర్పాటుగా జరిగిందని, తాను కేవలం గెస్ట్‌గా వెళ్లానని స్పష్టం చేశారు.
కుటుంబ పాలన కేసీఆర్‌కే సాధ్యం..
ఇక గత పదేళ్ల కేసీఆర్ పాలన తీరును ఈ సందర్భంగా ఎండగట్టారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ కొడుకు, అల్లుడికి మంత్రి పదవులు ఇచ్చారని, కూతురును ఎంపీ చేశాడని గుర్తు చేశారు. మందు పోసే సంతోష్‌రావుకు కూడా రాజ్యసభ పదవి ఇచ్చాడని, కూతులు ఎంపీగా ఓడిపోతే ఆరు నెలలు తిరగకుండానే ఎమ్మెల్సీని చేశారని తెలిపారు. దీంతో అందరూ ఐదు తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు సంపాదించుకున్నారని తెలిపారు. తన మనుమడు ఫుట్‌బాల్ ఆడితే తప్పేంటని నిలదీశారు. తన మనుమడికి పదవి ఇవ్వలేదు కదా అని ప్రశ్నించారు.