
Dussehra 3rd day collections : న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం మార్చి 30 వ తారీఖున భారీ అంచనాల నడుమ తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి సుమారుగా 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
నాని గత చిత్రం ‘అంటే సుందరానికి’ సినిమాకి క్లోసింగ్ లో కూడా ఈ స్థాయి వసూళ్లు రాలేదని చెప్పొచ్చు.నాని భారీ సినిమాలు తీస్తే స్టార్ హీరో కి ఏమాత్రం తీసిపోడు అని నిరూపించిన చిత్రం ఇది.రెండవ రోజు కూడా ఈ సినిమాకి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే ఆరు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రెండు రోజుల్లోపే 1 మిలియన్ మార్కుని దాటేసింది.

ఇక మూడవ రోజు రెండవ రోజు కంటే ఎక్కువ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మూడవ రోజు ఈ సినిమా సుమారు గా 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిందని అంచనా.కచ్చితంగా ఇది అద్భుతమైన వసూళ్లే,కానీ తెలంగాణ లో వస్తున్న వసూళ్లతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో వస్తున్న వసూళ్లు చాలా తక్కువ అని చెప్పాలి.
సినిమా మొత్తం పూర్తిగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉండడం, బాషా మరియు యాస కూడా ఇక్కడ ఆడియన్స్ కి సరిగా అర్థం కాకపోవడం వల్ల కూడా ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ లో తక్కువ వసూళ్లు రావడానికి కారణం అయ్యాయని విశ్లేషకులు అంటున్నారు.మొత్తం మీద మూడు రోజులకు కలిపి ఈ సినిమా 38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.