https://oktelugu.com/

Cheetah: మనుషులే కాదు.. మద్యం తాగితే పులి కూడా పిల్లినే.. వైరల్ వీడియో

సరిగ్గా పై ప్రశ్నలకు సమాధానంగా బీహార్ రాష్ట్రంలో ఓ ఘటన జరిగింది. బీహార్ రాష్ట్రంలో అడవికి దగ్గరగా ఉన్న ఓ మారుమూల గ్రామంలో మద్యం తయారీ కర్మాగారం ఉంది. అయితే అందులోకి ఓ చిరుత పులి ప్రమాదవశాత్తు ప్రవేశించింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 18, 2024 / 12:47 PM IST

    Cheetah

    Follow us on

    Cheetah: మద్యం తాగితే ఎంతటి మనిషైనా సరే తూలిపోతాడు. మద్యం మత్తులో పడిపోతాడు. అడుగులు తడబడతాయి.. మాటలు తుత్తరపోతాయి. ఆ మత్తు ఇంకా ఎక్కువ అయితే అవి కూడా రావు. జస్ట్ ఏ రోడ్డు పక్కన్నో.. చెట్టు పక్కన్నో మనిషి పడిపోతాడు. అచేతనంగా ఉండిపోతాడు. మరి అలాంటి మద్యాన్ని చిరుత పులి తాగితే ఎలా ఉంటుంది? మద్యం తాగిన తర్వాత దాని పరిస్థితి ఎలా ఉంటుంది? దానికి కూడా మత్తు కలుగుతుందా? ఆ మత్తులో అది ఏం చేస్తుంది?

    సరిగ్గా పై ప్రశ్నలకు సమాధానంగా బీహార్ రాష్ట్రంలో ఓ ఘటన జరిగింది. బీహార్ రాష్ట్రంలో అడవికి దగ్గరగా ఉన్న ఓ మారుమూల గ్రామంలో మద్యం తయారీ కర్మాగారం ఉంది. అయితే అందులోకి ఓ చిరుత పులి ప్రమాదవశాత్తు ప్రవేశించింది. అందులో ఉన్న మద్యాన్ని తాగింది. ఆ మద్యం తాగిన తర్వాత అది ఒక్కసారిగా మత్తులోకి వెళ్లిపోయింది. కనీసం అడుగు తీసి అడుగువేయలేని స్థితికి చేరుకుంది. ముందు ఆ చిరుతని చూసి కొంతమంది భయపడ్డారు. తర్వాత అది అలాగే పడుకొని ఉండటం చూసి మద్యం తాగి ఉంటుందని వారిలో వారే నవ్వుకున్నారు. కొంతసేపటికి చిరుత లేచింది. అయినప్పటికీ దానికి మత్తు దిగలేదు. అప్పటిదాకా అధికారంలో ఉంటే తన ప్రాణాలకు ఇబ్బంది అని భావించి అందులో పని చేస్తున్న కార్మికులు దానిని బయటికి సాగనంపారు.

    అలా మత్తులో పులి అడుగులు అడుగు వేసుకుంటూ బయటికి వెళ్లడం మొదలుపెట్టింది. దానిని ఆ కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులు అనుసరించడం మొదలుపెట్టారు. పులి ఎలాగూ మత్తులో ఉండటంతో తమను ఏమీ చేయలేదనే ధైర్యంతో దాని మీద చేతులు వేసి.. నడవడం మొదలుపెట్టారు. ఎవరో ఔత్సాహికుడు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అది చర్చనీయాశంగా మారింది. ఈ వీడియోని చూసిన చాలామంది రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అది మద్యం మత్తులో ఉంది కాబట్టి నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది.. ఒకవేళ ఆ మత్తులో లేకుంటే మీ అందరి తలలు తీసుకెళ్లేది అంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.