Cancer Vaccine: క్యాన్సన్ అనగానే భయంకరమైన వ్యాధిగా చాలా మంది భావిస్తారు. చదువుకున్న వారు, చదువు రానివారు ఈ వ్యాధి పేరు చెబితేనే భయపడతారు. ఇక వ్యధి వచ్చిన వారు అయితే దీనికి ట్రీట్‌మెంట్ లేదు.. వ్యాధి వస్తే చనిపోవడమే అని చాలా మంది అనుకుంటారు. కానీ, ఈ వ్యాధికి కూడా వ్యాక్సిన్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఇది తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని 95 శాతం నిరోధిస్తుంది. కాస్త ఖరుదు ఎక్కువైనా.. తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
పెరుగుతున్న క్యాన్సర్ కేసులు..
ఇక దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లు చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఆడవాళ్లకు సోకే క్యాన్సర్లలో బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ప్రకారం హ్యూమన్ పాపిలోమా వైరస్ ద్వారా సర్వైకల్, త్రోట్, బ్రెస్ట్‌తోపాటు ఇతర క్యాన్సర్ల బారిన ఏటా 7 లక్షల మంది పడుతున్నారు. ఇందులో సగం మంది చనిపోతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
అందుబాటులో వ్యాక్సిన్..
క్యాన్సర్‌లో కొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కానీ, ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇక తెలిసిన వాళ్లు ధర ఎక్కువ అని తీసుకోవడం లేదు. మేము మత్తు పదార్థాలకు దూరంగా ఉంటున్నాం, మాకు క్యాన్సర్ రాదు అని ఇంకొందరు వ్యాక్సిన్ తీసుకోవం లేదు. కానీ మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. శరీరంలో పెరిగే అసాధారణ కణాలకు సహకారం అందిస్తున్నాయి. దీంతో ఎలాంటి చెడు వ్యసనాలు లేనివారు కూడా క్యాన్సర్ భారిన పడుతున్నారు. దీంతో కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించే శక్తి ఈ వ్యాక్సిన్‌కు ఉంది.
ఖరీదు ఎక్కువే..
ఇక ఈ వ్యాక్సిన్ ఖరీదు రూ.4 వేలు. కాస్త ధర ఎక్కువే. దీనిని 9 నుంచి 45 ఏళ్లలోపువారు తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ ఉన్నవారు. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు తీసుకోవద్దు. ఈ వ్యాక్సిన్ హెచ్‌పీవీ వైరస్ కారణంగా వచ్చే క్యాన్సర్లను 97 శాతం నిరోధిస్తుంది. ఇక వ్యాక్సిన్ తీసుకునేవారు వైద్యులను సంప్రదించి తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు.