https://oktelugu.com/

Anchor Suma: మంచి మనసు చాటుకున్న యాంకర్ సుమ… పెళ్లి రోజు ఆమె చేసిన పనికి అందరూ ఫిదా!

సుమ-రాజీవ్ లతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. సుమ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అభిమానులు, సోషల్ మీడియా జనాలు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : February 18, 2024 / 12:53 PM IST

    Anchor Suma

    Follow us on

    Anchor Suma: సుమ కనకాల దశాబ్దాలుగా బుల్లితెరను ఏలుతున్నారు. ఆమెకు పోటీ ఇచ్చే యాంకర్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. యాంకరింగ్ లో ఒక బెంచ్ మార్క్ చేశారు. ఓ స్టార్ హీరోయిన్ కి ఏ మాత్రం తగ్గని ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. తాజాగా సుమ చేసిన పనికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఆమె తన పెళ్లి రోజు వేడుకలు వృద్ధాశ్రమంలో చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఓ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన సుమ దంపతులు వారితో ముచ్చటించారు. వృద్ధులకు ఆహారం ఏర్పాటు చేశారు.

    సుమ-రాజీవ్ లతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. సుమ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అభిమానులు, సోషల్ మీడియా జనాలు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సుమది మంచి హృదయం అంటున్నారు. కాగా నటుడు రాజీవ్ కనకాలను సుమ ప్రేమ వివాహం చేసుకుంది. సుమ మలయాళీ అమ్మాయి. ఉద్యోగరీత్యా వాళ్ళ నాన్న హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు.

    నటి కావాలనుకున్న సుమ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో రాజీవ్ కనకాల పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లయ్యాక నటన మానేయాలని సుమకు రాజీవ్ కండీషన్ పెట్టాడట. అది నచ్చని సుమ కొన్నాళ్ళు అవైడ్ చేసిందట. దానితో కాంప్రమైజ్ అయిన రాజీవ్ కనకాల నీ ఇష్టం… మనం పెళ్లి చేసుకుందాం అన్నాడట. అలా ఇద్దరూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం.

    సుమ కొడుకు రోషన్ కనకాల ఇటీవల హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బబుల్ గమ్ టైటిల్ తో యూత్ ఫుల్ ఇంటెన్స్ లవ్ డ్రామా చేశాడు. బబుల్ గమ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. రోషన్ కనకాల నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ మధ్య రాజీవ్-సుమ మధ్య గొడవలంటూ వార్తలు వచ్చాయి. విడాకులకు సిద్ధం అవుతున్నారని పుకార్లు వినిపించాయి. ఈ పుకార్లను రాజీవ్ కనకాల దంపతులు కొట్టిపారేశారు. 9.