
Summer Cool Water: వేసవి కాలంలో చాలా మందికి చల్లని నీరు తాగడం అలవాటు. కానీ చల్లని నీరు తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ విషయం తెలిసినా ఎవరు కూడా పట్టించుకోరు. ఇంకా ఫ్రిజ్ లో నీరు తాగడం వల్ల ఇతర ఇబ్బందులు ఏర్పడతాయి. వేసవి కాలంలో కుండలో నీరు తాగితే మంచిది. కానీ ఎందరికి కుండలో నీరు తాగడం అలవాటు. ఎక్కువగా ఫ్రిజ్ లని నీరు తాగడమే చేస్తుంటారు. దీని వల్ల నష్టాలు ఉన్నాయని తెలిసినా మానడం లేదు. ఫలితంగా ఇతర జబ్బులకు కేంద్రంగా నిలుస్తున్నారు.
ఎండలో చల్లని నీరు తాగడం వల్ల ఉఫశమనం కలుగుతున్నా తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. చల్లనినీరు తాగడం వల్ల గొంతు బిగుసుకుపోయి గొంతునొప్పి వస్తుంది. దీన్ని బ్రెయిన్ ఫ్రీజ్ అంటారు. ఆహారం తిన్న వెంటనే చల్లని నీరు తాగడం వల్ల శ్లేష్మం ఏర్పడి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. కూల్ వాటర్ ఎక్కువగా తాగితే గుండెకు కూడా ప్రమాదకరమే. గుండెపోటు వచ్చేందుకు అవకాశాలుంటాయి. చల్లని నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ చెడిపోతుంది.
మన రోగనిరోధక వ్యవస్థ బద్ధకిస్తుంది. ఎండలో తిరిగి వచ్చినప్పుడు వ్యాయామం చేసినప్పుడు చల్లని నీరు తాగితే శరీరం డీ హైడ్రేడ్ అవుతుంది. అందుకే మనం ఫ్రిజ్ వాటర్ తాగడం అంత సురక్షితం కాదని తెలిసినా వినరు. అసలు ఇంట్లో ఫ్రిజ్ ఉంచుకోవడమే మంచిది కాదు. ఫ్రిజ్ లో క్రిములు ఎన్నో ఉంటాయి. వీటి వల్ల మన ఇంట్లో కూడా అనారోగ్య వాతావరణం ఏర్పడుతుంది. ఈ విషయాలు చెప్పినా అర్థం కావు. అందరు నాగరికత పేరుతో ఒకరిని చూసి మరొకరు ఫ్రిజ్ లు కొంటున్నారు. అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు.

వేసవిలో చల్లని కుండలో నీరు తాగడం ఎంతో మంచిది. మట్టి కుండలో మనకు కావాల్సిన పోషకాలు ఎన్నో దాగి ఉంటాయి. మట్టి పాత్రల్లో వంట చేసుకుని తిన్నా కూడా ఆరోగ్యమే. మన పూర్వీకులు మట్టి పాత్రలను వాడటంతోనే వారికి ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు మనకు చిన్న వయసులోనే అన్ని రోగాలకు మూలం అవుతున్నాం. ఈ నేపథ్యంలో మనం కుండలో నీళ్లు తాగడమే సురక్షితం. దీనికి అందరు కట్టుబడి ఉండి కుండలో నీరు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.