Homeఎంటర్టైన్మెంట్Lliam Payne Died: స్టార్ సింగర్ లియామ్ పేన్ మృతిపై అనుమానాలు.. అసలు ఏలా మరణించాడు..?

Lliam Payne Died: స్టార్ సింగర్ లియామ్ పేన్ మృతిపై అనుమానాలు.. అసలు ఏలా మరణించాడు..?

Lliam Payne Died : పాప్ బాయ్ బ్యాండ్ వన్ డైరెక్షన్ లో సభ్యుడిగా ఉన్న ఆంగ్ల గాయకుడు లియామ్ జేమ్స్ పెన్ (31) బుధవారం (అక్టోబర్ 16) అర్జెంటీనాలో బ్యూనస్ ఎయిర్స్‌లోని ఒక హోటల్ మూడో అంతస్తు నుంచి పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. హోటల్ పై నుంచి ఒక వ్యక్తి పడిపోయాడన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అది పెన్ దిగా గుర్తించారు. 2010లో హ్యారీ స్టైల్స్, లూయిస్ టాంలిన్సన్, నియాల్ హొరాన్, జైన్ మాలిక్‌తో పాటు ‘X ఫాక్టర్ టీవీ షో’లో పేన్ ప్రపంచ గుర్తింపు పొందాడు. ఈ నెల (అక్టోబర్) ప్రారంభంలో, పేన్ తన మాజీ వన్ డైరెక్షన్ బ్యాండ్‌మేట్ నియాల్ హొరాన్ యొక్క అర్జెంటీనా కచేరీకి హాజరయ్యాడు. బ్యూనస్ ఎయిర్స్‌ పోలీసుల ప్రకారం.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు మద్యం, డ్రగ్స్ తో పైనుంచి కిందకు దూకాడా అని అనుమానాలు వ్యక్తం చేశారు. స్థానికులను విచారించగా పేన్ మరణించే సమయంలో లోపల పెద్ద శబ్దం వినిపించిందన్నారు. కొద్దిసేపటికే అక్కడ మృతదేహాన్ని గుర్తించామని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ అల్బెర్టో క్రెసెంటీ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, పేన్‌కు ‘తీవ్రమైన గాయాల’య్యాయి పేన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం హాస్పిటల్ కు తరలించారు.

పేన్ ఈ సంఘటనకు కొన్ని గంటల ముందు స్నాప్‌చాట్‌లో ‘అర్జెంటీనాలో ఇది ఒక అందమైన రోజు’ అని పోస్ట్ చేశాడు. అతని మరణ వార్త తెలియగానే, అభిమానులు బ్యూనస్ ఎయిర్స్ హోటల్ కు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. పేన్ కు కొవ్వొత్తులతో నివాళి అర్పించారు.

‘నేను నా గదిలో ఉన్నాను ఆ సమయంలో లియామ్ చనిపోయాడని నా సోదరి నాకు చెప్పింది’ అని వైలెట్ యాంటియర్ అనే యువ అభిమాని రోధించాడు. ‘మేము నమ్మలేకపోయాం. నిర్ధారించుకునేందుకు మేము నేరుగా ఇక్కడకు వచ్చాం.’ అని వివరించారు.

ఆన్‌లైన్‌లో నివాళులు..
బాయ్‌బ్యాండ్ ది వాంటెడ్ నుంచి మాక్స్ జార్జ్, అతను ది ఎక్స్ ఫ్యాక్టర్ విత్ వన్ డైరెక్షన్‌లో పోటీ చేస్తున్నప్పుడు పేన్‌ను కలిశానని, అతని మరణం విశాధకరమైనదిగా వివరించాడు. ‘కొన్ని సంవత్సరాలుగా నేను అతనితో విలువైన సమయాన్ని గడిపాను’ అని అతను ఇన్‌ స్టాలో చెప్పాడు. పార్కర్ 33 సంవత్సరాల వయస్సులో 2022లో మరణించినప్పుడు, పేన్ అంత్యక్రియలకు హాజరయ్యాడు.

UKలోని వోల్వర్‌హాంప్టన్‌లో జన్మించిన పేన్, 2008లో ITV టాలెంట్ షో ది ఎక్స్ ఫ్యాక్టర్ కోసం ఆడిషన్ చేశాడు. ఆ సమయంలో స్టార్‌ డం కోసం ప్రయత్నించాడు – కానీ జడ్జి సైమన్ కోవెల్ అతనికి మరో రెండేళ్ల తర్వాత రావాలని సూచించాడు. 2010లో న్యాయ నిర్ణేతలను (జడ్జి) ఆకట్టుకున్నాడు, బూట్ క్యాంప్ దశలో మరో నలుగురు సోలో ఆశావహులతో కలిసి ‘వన్ డైరెక్షన్ డిస్కోగ్రఫీ’ పెట్టాడు. ఈ బృందం సక్సెల్ లో నాలుగు యూకే నెంబర్ వన్ ఆల్బమ్‌లు, నాలుగు నంబర్ వన్ సింగిల్స్ అలాగే ప్రపంచ వ్యాప్తంగా టాప్ చార్ట్‌లు ఉన్నాయి.

2017లో, పేన్ తొలి సోలో సింగిల్ స్ట్రిప్ దట్ డౌన్, అధికారిక యూకే చార్ట్‌లో మూడో స్థానానికి చేరుకుంది. ఫిఫ్టీ షేడ్స్ ఫ్రీడ్ సౌండ్‌ట్రాక్ నుంచి ఫర్ యూ సాంగ్ ను రీటా ఓరాతో కలిసి పాడారు. ఇది అతన్ని టాప్ 10కి తీసుకెళ్లింది. అతను 2016లో ‘గర్ల్స్ అలౌడ్’ స్టార్ చెరిల్ ట్వీడీతో రిలేషన్ లో కొనసాగాడు. వారికి 2017లో బేర్ అనే కుమారుడు జన్మించాడు. ఈ జంట 2018లో విడిపోయింది.

 

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular