Double Decker Auto: డబుల్ డెక్కర్ బస్సు విన్నాం.. డబుల్ డెక్కర్ రైలు విన్నాం.. కానీ డబుల్ ఆటో కూడా ఉంటుందంటే ఎవరైనా నమ్ముతారా? ఉందని నిరూపిస్తున్నారు కొందరు. డబుల్ డెక్కర్ ఆటో ఇలా ఉంటుందని కొందరు ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. ఈ డబుల్ డెక్కర్ ఆటో ద్వారా ఒకేసారి ఎక్కువ మందిని తీసుకెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా దీని వల్ల ట్రాఫిక్ కు కూడా ఇబ్బందులు ఏర్పడవని చెబుతున్నారు.
ఆటోమొబైల్ రంగంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూ ఉంటాయి. అయితే అన్నీ ఉపయోగకరంగా ఉండే అవకాశాలు లేవు. కొన్ని కంపెనీలో కొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చే ముందు ఎంతో ఆలోచిస్తుంటాయి. అయితే కొందరు సామాన్యులు తమకున్న నాలెడ్జ్ ఆధారంగా కొన్ని ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసుకుంటూ ఉంటారు. వ్యవసాయం, ఇతర రంగాల వారు తమకు అవసరయ్యే వస్తువులను వారే తయారు చేసుకుంటారు.
ఇలా ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. రోజూ వారీ ఆటో నడపడం ద్వారా తనకు వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. దీంతో తన ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవాలనుకున్నాడు. అయితే కొత్త మరో ఆటో కొనే స్తోమత లేదు. అలాగని ఆ ఆటో నడపాలంటే మరో వ్యక్తి కావాలి. ఇదంతా ఎందుకని తన ఆటోపై మరో కప్పు ఏర్పాటు చేసి ప్రయాణికులు కూర్చునేలా ఏర్పాటు చేశాడు. దీంతో ఆ ఆటోలో సాధారణ ఆటోకంటే ఎక్కువ మందికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
అయితే ఇది అన్ని ప్రదేశాల్లో సక్సెస్ అవుతుందా? అంటే చెప్పలేమని అంటున్నారు. ఎందుకంటే పట్టణాల్లో ఉండే కొన్ని ప్రదేశాల్లోకి వెళ్లాలంటే ఈ ఆటో నిరుపయోగమేని అంటున్నారు. అలాగే ఆటోకు ప్రమాదం ఏర్పడితే ఎక్కువ మంది ఇంజూర్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ డబుల్ డెక్కర్ ఆటో వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది.
https://youtube.com/shorts/3Fy_WQqBe44?feature=share