
Mohan Babu: సినీ నటుడు మోహన్ బాబు తన పెద్ద కొడుకు విష్ణు మ్యారేజ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏబీన్ లో ప్రసారవమవుతున్న ఓపెన్ విత్ ఆర్కే కార్యక్రమానికి హాజరైన ఆయన తన మనోగతాన్ని ఆవిష్కరించారు. తనుకు పెళ్లి ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సి వచ్చిందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ కథనం ఏడాది క్రితం ప్రసారమైనా… ఇంకా వైరల్ అవుతూనే ఉంది.
మంచు విష్ణు పెళ్లి చేసుకున్న విరానికా రెడ్డికి పెద్ద బ్యాంగ్రౌండే ఉంది. ఆమె స్వయానా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు చెల్లెలు. రాజారెడ్డికి 4వ కొడుకునైన సుధాకర్ రెడ్డి కూతురు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెద్ద నాన్న అవుతారన్న మాట. విష్ణుతో ఆమె పెళ్లికి మోహన్ బాబుకు ఇష్టం లేదట. కులాలు వేరుగా ఉండటంతో ససేమిరా ఒప్పుకోలేదని సినీ వర్గాల టాక్. అయితే, విష్ణు పట్టబట్టడంతో ఆయన ఒప్పుకోక తప్పలేదని అంటున్నారు.
ఇదే విషయాన్ని ఓపెన్ విత్ ఆర్కేలో ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ ప్రస్తావనకు తీసుకువచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా కథనాలు ఎందుకు ప్రచురించారంటూ అడిగిన మోహన్ బాబుకు, మాటల సందర్భంలో ఆయనతో బంధుత్వం మీకు ఇష్టమయ్యే చేసుకున్నారా అంటూ ఆర్కే ప్రశ్నించారు. దీనిపై మోహన్ బాబు సమాధానమిస్తూ.. ‘‘అవును వాళ్లిద్దరి పెళ్లి ఇష్టం లేదు. కానీ, ఇద్దరు ప్రేమించుకున్నారు. నేను కులాలు చూడలేదు. రెడ్డి, కమ్మ, దళిత లేదా మరే కులం నాకు పట్టింపు లేదు. అందుకే పెళ్లి చేశా’’ అని సమాధానమిచ్చారు.

విరానికా రెడ్డి తల్లికి సినీ బ్యాగ్రౌండ్ ఉంది. అటు తండ్రి నుంచి రాజకీయాల నుంచి పట్టు ఉంది. ఈమెతో పెళ్లి తరువాత మోహన్ బాబు, వైఎస్ కుటుంబానికి బంధువు అయ్యారు. ఇటీవల విష్ణు మా అసోసియేషన్ కు పోటీ చేసినప్పుడు, జగన్ నుంచి పూర్తి మద్దతు లభించింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో మీ కోసం…
