
Donald Trump: ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా ఉన్నత స్థాయికి వెళ్లాలంటే అందుకు సులువైన మార్గం రాజకీయాలు.డబ్బు ఉంటె చాలు MLA అయిపోవచ్చు, మినిస్టర్స్ అయిపోవచ్చు కోట్ల రూపాయిల సంపాదనని ఆర్జించవచ్చు.క్వాలిఫికేషన్ లేని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత స్థానాల్లోకి వెళ్లినా పర్లేదు.కానీ మర్డర్ కేసులు మరియు రేప్ కేసు లు ఉన్నవాళ్లు కూడా నేడు రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ పోర్న్ స్టార్ ఎంజాయ్ చేసి అనంతరం ఆమె దాన్ని బయటపెట్టకుండా డబ్బులు ఎరచూపిన కేసులో అడ్డంగా బుక్కాడు. ఈ కేసులో తాజాగా న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ కోర్టు ట్రంప్ ను దోషిగా ధ్రువీకరించి ఆయనపై అభియోగాలు మోపింది. ట్రంప్ అరెస్ట్ తప్పదన్నట్టుగా అమెరికన్ మీడియా పేర్కొంటోంది. ఇది అమెరికా చరిత్రలోనే నేరారోపణలకు క్రిమినల్ ఛార్జ్ లను ఎదుర్కోనున్న తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ట్రంప్ మాత్రమే కాదు.. మన దేశంలోనూ ఇలా సెక్స్ స్కాండిల్స్ లో ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలైన నేతలు ఉన్నారు.
ట్రంప్ మాత్రమే కాదు.. మన దేశంలోనూ చాలా మంది రాజకీయ నాయకులూ ఈ సెక్స్ స్కాండిల్స్ లో అడ్డంగా కెమెరాలకు దొరికిన వారున్నారు. వాళ్లకి ఉన్నత పదువులు ఉండడం సిగ్గు చేటు అనే చెప్పాలి. అలా అడ్డంగా వ్యభిచార కూపాలలో దొరికిన 15 మంది రాజకీయ నాయకుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం.
1.) రాఘవజీ లక్ష్మి శవాల:
మధ్య ప్రదేశ్ లో ఫైనాన్స్ మినిస్టర్ గా రాఘవజీ లక్ష్మి శవాల కొనసాగిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఈయన 2013 వ సంవత్సరం లో సహాయం కోరి వచ్చిన ఒక యువకుడికి ప్రభుత్వం లో శాశ్వతంగా ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి అతని పై లైంగిక దాడులు చేసాడు.అతను కోర్టు ని ఆశ్రయించడం తో అప్పట్లో ఈ వార్త పెద్ద సెన్సేషన్ అయ్యింది.ఇలా లైంగిక దాడులు చేసినప్పుడు రాఘవ్ జీ వయస్సు 79 ఏళ్ళు అవ్వడమే గమనార్హం.
2 )బాబు లాల్ నగర్ :
2013 వ సంవత్సరం లో జైపూర్ నుండి ప్రభుత్వ ఉద్యోగం చెయ్యడానికి వచ్చిన ఒక యువతి ని రాజస్థాన్ మినిస్టర్ బాబూలాల్ నగర్ లైంగికంగా ఆమెని ఎంతగానో వేధించాడు.ప్రభుత్వం లో ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చాడని, కానీ అందుకోసం ఆయన తన కామ వాంఛలు తీర్చాల్సిందిగా తనని ఎంతో ఇబ్బంది పెట్టాడని ఆ యువతి బాబూలాల్ పై కేసు వేసింది.అది నిజమని నిరూపణ జరగడం తో బాబు లాల్ తన పదవి కి రాజీనామా చెయ్యాల్సి వచింది.
3) అభిషేక్ మను సింఘవి:
అభిషేక్ మను సింఘవి రాజ్య సభ లో ఎంపీ..అంతే కాదు ఇతను సుప్రీమ్ కోర్టులో లీడింగ్ లాయర్స్ లో ఒకరు.ఇతని దగ్గర డ్రైవర్ గా పని చేసే ముకేశ్ కుమార్ లాల్ అభిషేక్ కి సంబంధించిన ఒక CD ని మీడియా ముందు పెడుతున్నాని బెదిరించి, అతనిని తన పదవి నుండి రాజీనామా చేయించాడు.ఇంతకీ ఆ CD లో ఏముందో ఎవరికీ తెలియదు కానీ, అతను అలా భయపడ్డాడు అంటే కచ్చితంగా లైంగిక కార్యకలాపాలకు సంబంధించినదే ఉందని అంటున్నారు విశ్లేషకులు.
4 ) గోపాల్ కండా:
హర్యానా మినిస్టర్ గోపాల్ కండా పై కూడా ఇలాంటి అభియోగాలు చాలానే ఉన్నాయి.ప్రముఖ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ అప్పట్లో గోపాల్ కండా తనపై అత్యాచారం చేసాడని ఆరోపిస్తూ ఒక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన ఆరోజుల్లో పెద్ద కలకలం సృష్టించింది.తాను ఇలా చనిపోవడానికి కారణం గోపాల్ కండా నే అంటూ ఆమె ఆ సూసైడ్ నోట్ లో రాసిపెట్టి చనిపోయింది.దీనితో గోపాల్ కండా అరెస్ట్ అయ్యాడు, 2014 వ సంవత్సరం లో అతని లావేరు గోపాల్ కోసం బెయిల్ కి అప్లై చెయ్యగా, ఢిల్లీ హై కోర్టు తిరస్కరించింది.
5) మనిపాల్ మాడెర్నా:
రాజస్థాన్ లో ఇతను జలవనరుల శాఖా మంత్రిగా అందరికీ సుపరిచితమే.అయితే ఇతగాడు 2011 వ సంవత్సరం లో హాస్పిటల్ లో పని చేస్తున్న ఒక నర్స్ ని కిడ్నాప్ చేసి ఆమెపై లైంగిక వేధింపులు చేసాడని అప్పట్లో ఇతని పై కేసు పడింది.బాధితురాలి పేరు బన్వారి దేవి.మనిపాల్ మీద ఆమె వేసిన ఆరోపణలు అన్ని నిజం అని నిర్ధారణ అవ్వడం తో అతని పై గెహ్లాట్ ప్రభుత్వం నిషేధం విధించింది.పదవి నుండి తొలగించి, పార్టీ నుండి శాశ్వతంగా సస్పెండ్ చేసింది.
6 ) ND తివారి :
ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి ND తివారి మీద కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి.కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఈ సీనియర్ నేత ఉత్తరప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది, అలాగే ఉత్తరాఖండ్ కి గవర్నర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది.85 ఏళ్ళ వయస్సులో ఈయన ఇలాంటి అభియోగాలను ఎదుర్కొని జైలు పాలయ్యాడు.అసలు విషయానికి వస్తే 2008 వ సంవత్సరం లో రోహిత్ శేఖర్ తివారి అనే అతను ND తివారి తన తండ్రి అంటూ కోర్టు లో కేసు వేసాడు.DNA రిపోర్ట్స్ ని టెస్ట్ చేసిన తర్వాత నిజంగానే రోహిత్ శేఖర్ తివారి ND తివారి కి కొడుకు అనే విషయం నిర్ధారణ అయ్యింది.అలాగే 2013 వ సంవత్సరం లో ఒక్క కుర్ర టీవీ యాంకర్ తో కలిసి ఈయన చిందులు వేసిన వీడియో సోషల్ మీడియా లో అప్పట్లో వైరల్ గా మారింది.
7)సంజయ్ జోషి :
2005 వ సంవత్సరం లో సంజయ్ జోషి అనే BJP నాయకుడు తన సిల్వర్ జూబిలీ వేడుకలలో ఒక యువతిపై లైంగిక వేదింపులు చేసాడని ఆరోపణలు ఉన్నాయి.దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా లో బయటపడడం తో సంజయ్ జోషి BJP పార్టీ జనరల్ సెక్రటరీ పదవి కి రాజీనామా చేసి బయటకి వచేసాడు.

కేవలం వీళ్ళు మాత్రమే కాదు అమర్మణి త్రిపాఠి, హరక్ సింగ్ రావత్, సింప్లి గౌతమ్ , గోపినాథ్ ముండే, సురేష్ రామ్ తదితరులు ఇలా ఆడవాళ్ళ పై లైంగిక వేధింపులు జరిపి రాజకీయాల నుండి నిష్క్రమించిన వాళ్ళే.ఇలా దొరికిపోయి పట్టుబడిన రాజకీయ నాయకుల సంగతి సరే, కానీ దొరకకుండా దుర్మార్గాలు చేస్తూ మన మంత్రులుగా, MLA లు గా కొనసాగుతున్న వాళ్ళ సంగతి ఏమిటి..?, మన ఆంధ్ర ప్రదేశ్ ని ఉదాహరణగా తీసుకుందాం, ఇక ఎంతో మంది మంత్రులు లైంగిక కార్యకలాపాలు చేస్తూ సోషల్ మీడియా లో అడ్డంగా పట్టుబడినా కూడా ప్రభుత్వం వీరిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు.మన ఖర్మ ఏమిటంటే రాబొయ్యే ఎన్నికలలో కూడా వీళ్ళే మన నాయకులుగా ఎన్నికలలో పోటీ చేస్తారు.మనల్ని శాసిస్తారు కూడా, ఈ దరిద్రంగా సిస్టం ఎప్పటికి మారుతుందో ఆ దేవుడికే తెలియాలి.