Dolphins
Dolphins: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్(Sunitha Williams)తో సహా నలుగురు వ్యోమగాములను తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో ఫ్లోరిడా తీరం సమీపంలో సముద్రంలో భూమికి దిగివచ్చారు. ఈ సందర్భంగా అద్భుత దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ వ్యోమనౌకను బయటకు తీసేందుకు స్పీడ్ బోట్లు(Speed Boats) వచ్చినప్పుడు, డాల్ఫిన్లు(Dalifins) సృష్టించిన సందడి అందరి మనసులో మునిగిపోయింది. అనుకోని అతిథుల్లా వచ్చిన ఈ తెలివైన జీవులు, వ్యోమనౌక చుట్టూ డైవ్ చేస్తూ కనువిందు చేశాయి. వీటి రాకకు కారణం ఏమిటన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. డాల్ఫిన్లు సంఘ జీవులు, అత్యంత తెలివైనవి, కుతూహలం ఎక్కువగా కలిగినవి. సముద్రంలో నౌకలు కనిపిస్తే వాటి వద్దకు వచ్చి సందడి చేస్తాయి. కొన్నిసార్లు నౌకలతో పోటీపడుతున్నట్లు వాటి ముందు దూసుకెళతాయి. క్రూ డ్రాగన్ ల్యాండింగ్ సమయంలోనూ డాల్ఫిన్లు ఇదే తరహాలో వచ్చాయి. వీటి విచిత్ర ప్రవర్తనకు విహారం, వినోదం, వేట వంటి కారణాలు ఉన్నాయి.
Also Read: సనాతనం ఎఫెక్ట్ : ఇఫ్తార్ విందుకు పవన్ దూరం
ఆ తరంగం కారణంగా…
నౌకలు వేగంగా కదిలినప్పుడు వాటి ముందు ‘బౌ వేవ్’(How wave) అనే పీడన తరంగం ఏర్పడుతుంది. డాల్ఫిన్లు ఈ తరంగంలో ప్రయాణిస్తాయని సముద్ర జీవశాస్త్రవేత్తలు చెబుతారు. ఈ ప్రయాణం అలలపై సర్ఫింగ్‌లా ఉంటుంది, తక్కువ శ్రమతో ఎక్కువ దూరం పోవడానికి వీలవుతుంది. ఇది డాల్ఫిన్లకు వినోదం, ఉల్లాసం కలిగిస్తుంది కాబట్టి గుంపులుగా ఈ విన్యాసంలో పాల్గొంటాయి. ముఖ్యంగా బాటిల్‌నోస్ డాల్ఫిన్లు దీన్ని ఇష్టపడతాయి. క్రూ డ్రాగన్ ల్యాండింగ్ సమయంలో స్పీడ్ బోట్ల హడావుడి, అలజడి వీటిని ఆకర్షించి ఉండవచ్చు.
శ్రమ జీవులుగా…
పురాతన కాలం నుంచి డాల్ఫిన్లు నౌకలను వెంబడిస్తున్నాయి. గ్రీక్ నావికులు వీటిని పవిత్ర జీవులుగా భావించేవారు. సముద్ర దేవుడు పొసైడాన్ దూతలుగా ఆరాధించేవారు. అలాగే, నౌకల అలజడి వల్ల చేపలు గందరగోళంలో పడటం డాల్ఫిన్లకు వేటకు సులభతరం చేస్తుందని కూడా చెబుతారు. డాల్ఫిన్లు క్షీరదాలు, తమ సంతానానికి పాలిచ్చి పెంచుతాయి. గుంపులుగా జీవించే ఈ జీవులు ఈలల ద్వారా సంభాషిస్తాయి, పరస్పరం పేర్లతో పిలుచుకుంటాయి. క్రూ డ్రాగన్ ల్యాండింగ్‌లో వీటి సందడి ప్రకతి, మానవ నైపుణ్యం కలయికను అద్భుతంగా చూపించింది.