Gangula Kamalakar
Gangula Kamalakar : దేశంలో 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఈమేరకు కేంద్రం ఇంకా ప్రక్రియ ప్రారంభించలేదు. అయితే గత అనుభవాల దృష్ట్యా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని దక్షిణాది రాష్ట్రాల్లోని పలు పార్టీలు భావిస్తున్నాయి. ఇలా జరిగితే దక్షిణాదికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేక జేఏసీగా ఏర్పడి 1971 జనాభా ప్రకారం.. లేదా.. ప్రస్తుత నియోజకవర్గాల ప్రకారం విభజన చేయాలని కోరుతున్నాయి.
Also Read : డీలిమిటేషన్‌పై ఒక్కటైన రేవంత్-కేటీఆర్
దేశంలో నియోజకవర్గాల పునర్విభజన(Delimitation) 2026లో జరపాలని గతంలోనే నిర్ణయించారు. ఈమేరకు వచ్చే ఏడాది ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే, గతంలో నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరిగింది. ఈసారి కూడా అలాగే జరుగుతుందని దక్షిణాది(South india)లోని తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భావిస్తున్నాయి. అదే జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఈ రాష్ట్రాల్లోని పార్టీలు భావిస్తున్నాయి. పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గితే ప్రాధాన్యం కూడా తగ్గుతుందని పేర్కొంటున్నాయి. దక్షిణాదితో సంబంధం లేకుండానే చట్టాలు జరుగుతాయని, ప్రధాన మంత్రి ఎన్నిక కూడా జరుగుతుందని పేర్కొంటున్నాయి. అదే జరిగితే నిధుల కేటాయింపు తగ్గుతుందని, అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈమేరకు ఇటీవల తమిళనాడు(Tamilnadu)లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడే చేపట్టవద్దని తీర్మానించారు. తప్పనిసరి అయితే 1971 జనాభా లెక్కల ప్రకారం జరపాలని, అది కుదరని పక్షంలో ప్రస్తుత నియోజకవర్గాల ఆధారంగా జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
‘గంగుల’ సంచలన వ్యాఖ్యలు
ఒకవైపు జేఏసీ డీలిమిటేషన్‌పై పోరాటం చేస్తుండగా, తాజాగా తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీట్ల పెంపులో వివక్ష చూపితే దక్షిణాదిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. ఇందుకు తాము సిద్ధమని ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక దేశం కోసం కొట్లాడుతామని ప్రకటించారు. అంటే పరోక్షంగా దేశ విభజన ఉద్యమం చేపడతామని కేంద్రాన్ని హెచ్చరించారు.
ప్రత్యేక దేశ ఉద్యమాలు:
దక్షిణ భారతదేశంలో చారిత్రకంగా కొన్ని ప్రత్యేక దేశ ఉద్యమాలు (సెపరటిస్ట్ మూవ్‌మెంట్స్) ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది ద్రవిడ నాడు ఉద్యమం.
ద్రవిడ నాడు ఉద్యమం:
మూలం: ఈ ఉద్యమం 20వ శతాబ్దంలో, ముఖ్యంగా 1940–60ల మధ్య తమిళనాడులో బలంగా ఉద్భవించింది. జస్టిస్ పార్టీ మరియు తర్వాత ద్రవిడ మున్నేట్ర కళగం (ఈMఓ) నాయకుడు సి.ఎన్. అన్నాదురై ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు.
లక్ష్యం: ద్రవిడ భాషలు మాట్లాడే రాష్ట్రాలు (తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ) కలిపి ఒక స్వతంత్ర దేశం స్థాపించాలనేది లక్ష్యంగా ఉండేది. దీన్ని ‘ద్రవిడ నాడు‘ లేదా ‘సౌత్ ఇండియా‘ అని పిలిచేవారు.
నేపథ్యం: ఉత్తర భారతదేశంలోని ఇందో–ఆర్యన్ సంస్కృతి, హిందీ ఆధిపత్యం నుంచి ద్రవిడ సంస్కృతిని కాపాడుకోవడం ఈ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం. బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా కూడా ఇది ఒక తిరుగుబాటుగా మొదలైంది.
పరిణామం: 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం (States Reorganisation Act) ద్వారా భాషాపరమైన రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఈ ఉద్యమం బలహీనపడింది. తమిళనాడు తప్ప ఇతర ద్రవిడ రాష్ట్రాల నుంచి ఎటువంటి మద్దతు రాలేదు. 1963లో DMK అధికారికంగా స్వతంత్ర దేశ డిమాండ్‌ను విరమించుకుంది, కానీ ద్రవిడ గుర్తింపు కోసం పోరాటం కొనసాగించింది.
ఇతర సెపరటిస్ట్ భావనలు:
దక్షిణ భారతదేశంలో ఇతర ప్రాంతీయ ఉద్యమాలు (ఉదా: తెలంగాణ రాష్ట్ర ఉద్యమం) ఉన్నప్పటికీ, అవి భారతదేశంలోనే ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనే డిమాండ్‌తో ఉంటాయి, స్వతంత్ర దేశంగా కాదు. కొన్ని సందర్భాల్లో, ఉత్తర భారతదేశ ఆధిపత్యం లేదా హిందీ భాష రుద్దడంపై అసంతృప్తి వ్యక్తమవుతుంది, కానీ ఇవి సాధారణంగా సాంస్కృతిక గుర్తింపు లేదా రాజకీయ అధికారం కోసం ఉంటాయి, స్వతంత్ర దేశం కోసం కాదు.
Also Read : కేసీఆర్ మాట : పొత్తు లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదా?