https://oktelugu.com/

Venu Swamy Love Story: వేణు స్వామికి అంత పెద్ద లవ్ స్టోరీ ఉందా… ప్రియురాల్ని లేపుకుపోయి మరీ!

Venu Swamy Love Story: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియన్స్ కి వేణు స్వామి పరిచయం అక్కర్లేని పేరు. ఈయన సినిమా సెలబ్రిటీల జాతకాలు చెప్పడం ద్వారా ఫేమస్ అయ్యారు. ఆయన అంచనాలు కొన్ని కరెక్ట్ అయ్యాయి కూడా. సమంత-నాగ చైతన్యకు విడాకులు అవుతాయని ఆయన పెళ్ళైన కొత్తల్లోనే చెప్పారు. ఆయన చెప్పినట్లే నాలుగేళ్ళ వైవాహిక జీవితం అనంతరం సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకుని విడిపోయారు. అలాగే ఇంకా చాలా మంది హీరోలు, హీరోయిన్స్ జాతకాలు చెప్పి […]

Written By:
  • Shiva
  • , Updated On : March 6, 2023 / 09:52 AM IST
    Follow us on

    Venu Swamy Love Story

    Venu Swamy Love Story: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియన్స్ కి వేణు స్వామి పరిచయం అక్కర్లేని పేరు. ఈయన సినిమా సెలబ్రిటీల జాతకాలు చెప్పడం ద్వారా ఫేమస్ అయ్యారు. ఆయన అంచనాలు కొన్ని కరెక్ట్ అయ్యాయి కూడా. సమంత-నాగ చైతన్యకు విడాకులు అవుతాయని ఆయన పెళ్ళైన కొత్తల్లోనే చెప్పారు. ఆయన చెప్పినట్లే నాలుగేళ్ళ వైవాహిక జీవితం అనంతరం సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకుని విడిపోయారు. అలాగే ఇంకా చాలా మంది హీరోలు, హీరోయిన్స్ జాతకాలు చెప్పి ఆయన ఫేమస్ అయ్యారు.

    రష్మిక మందాన ఆయన శిష్యురాలు. కెరీర్లో ఎదగడం కోసం రష్మిక వేణు స్వామిని ఆశ్రయించారు. ఆయన రష్మికతో పలు ప్రత్యేక పూజలు చేయించారు. రష్మిక సక్సెస్ వెనుక వేణు స్వామి హస్తం ఉందట. అసలు రష్మిక తన మొదటి ప్రియుడు రక్షిత్ శెట్టిని వదిలేసింది వేణు స్వామి సలహాతోనే అట. ఆయన్ని చేసుకుంటే నీకు కెరీర్ లేదని చెప్పడంతో నిశ్చితార్థం అయ్యాక బ్రేకప్ చెప్పిందట. రష్మిక ఇంకా కెరీర్లో ఎదగడంతో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచి పార్లమెంట్ కి వెళుతుందని ఆయన చెప్పడం విశేషం.

    విజయ్ దేవరకొండకు రష్మిక దూరంగా ఉండాలని, లేదంటే ఆమెకు చిక్కులు తప్పవని చెప్పడంజరిగింది. హీరో హీరోయిన్స్ లవ్ ఎఫైర్స్, పెళ్లిళ్లు వారి కెరీర్స్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చెప్పే వేణు స్వామికి కూడా ఒక లవ్ స్టోరీ ఉంది. వేణు స్వామి లవ్ మ్యారేజ్ చేసుకున్నారట. అది కూడా తన లవర్ ని లేపుకుపోయి మూడు ముళ్ళు వేశాడట. ఈ విషయాన్ని ఆయన భార్య వీణ శ్రీవాణి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

    Venu Swamy

    మొదటి నుండి ఇండిపెండెంట్ ఉమన్ అయిన వీణ శ్రీవాణి… చదువుకునే రోజుల్లో పేరెంట్స్ మీద ఆధారపడకుండా మ్యూజిక్ క్లాసెస్ చెప్పేవారట. వీణ వద్ద మ్యూజిక్ నేర్చుకునేందుకు వేణు స్వామి కజిన్ కూతురు వెళ్ళేదట. ఆ పాపను రోజూ వీణ క్లాసెస్ కి వేణు స్వామి తీసుకెళ్లి తీసుకొచ్చేవాడట. ఆ క్రమంలో ఇద్దరి చూపులు కలవడం ప్రేమ మొదలవడం జరిగిపోయాయట. ఇద్దరిదీ ఒకే క్యాస్ట్ అయినప్పటికీ వీణ పేరెంట్స్ పెళ్ళికి ఒప్పుకోలేదట. దాంతో 2002లో లేచిపోయి వివాహం చేసుకున్నారట. వీణ పేరెంట్స్ ఇప్పటి కూడా ఆమెతో మాట్లాడరట. తన భర్త ఎంతో ప్రేమగా చూసుకుంటారని, ఆయన్ని ముద్దుగా తిరుపతి లడ్డు అని పిలుచుకుంటానని వీణ చెప్పుకొచ్చారు. నా వద్ద ఏమీ లేనప్పుడే నమ్మి నాతో వచ్చిన వీణ గ్రేట్ అని వేణు స్వామి అంటారు.

    Tags