https://oktelugu.com/

Tamanna: మగవాళ్ళని చూస్తే తమన్నా కి అలాంటి ఆలోచనలు వస్తాయా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్

Tamanna: ప్రతీ మనిషికి వింత అలవాట్లు ఎదో ఒకటి ఉండడం సహజం.సినీ రంగానికి చెందిన వాళ్ళు అందుకు అతీతం ఏమి కాదు, వీళ్లకు కూడా అలాంటి వింత అలవాట్లు ఎన్నో ఉన్నాయి,ముఖ్యంగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒక వింత అలవాటు ఉంది.ఈమెకి మగవాళ్ళతో ఎవరికైనా బుగ్గలు లావుగా ఉంటే గిల్లకుండా అసలు ఉండలేదట, ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా లెక్కచెయ్యడట.పరిగెత్తుకుంటూ వెళ్లి అతని బుగ్గలు గిల్లేస్తాది అట,ఈ విషయం స్వయంగా ఆమెనే ఇటీవల జరిగిన ఒక […]

Written By:
  • Vicky
  • , Updated On : April 18, 2023 / 11:42 AM IST
    Follow us on

    Tamanna

    Tamanna: ప్రతీ మనిషికి వింత అలవాట్లు ఎదో ఒకటి ఉండడం సహజం.సినీ రంగానికి చెందిన వాళ్ళు అందుకు అతీతం ఏమి కాదు, వీళ్లకు కూడా అలాంటి వింత అలవాట్లు ఎన్నో ఉన్నాయి,ముఖ్యంగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒక వింత అలవాటు ఉంది.ఈమెకి మగవాళ్ళతో ఎవరికైనా బుగ్గలు లావుగా ఉంటే గిల్లకుండా అసలు ఉండలేదట, ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా లెక్కచెయ్యడట.పరిగెత్తుకుంటూ వెళ్లి అతని బుగ్గలు గిల్లేస్తాది అట,ఈ విషయం స్వయంగా ఆమెనే ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది.

    ఈ అలవాటు మానుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నానని, కానీ నా వల్ల అవ్వట్లేదని చెప్తుంది.తమన్నా మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.తమన్నా లాంటి అందగత్తె బుగ్గ గిల్లితే మా జన్మ ధన్యం అవుతుందని,ఆ అదృష్టం మాకు ఎప్పుడు కలుగుతుందో అని తమన్నా ఫ్యాన్స్ ఈ సందర్భంగా సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

    మంచు మనోజ్ హీరో గా నటించిన శ్రీ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైనా తమన్నా, ఆ తర్వాత పలు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించి, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీ డేస్’ అనే చిత్రం ద్వారా మళ్ళీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది తమన్నా.

    Tamanna

    తెలుగు లో ఈమె టాప్ 6 హీరోలతో కలిసి నటించింది, తమిళం లో కూడా దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించింది,అలా అతి తక్కువ సమయం లోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తమన్నా, ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్ తో సమానంగా పోటీ పడుతూ వరుసగా అవకాశాలను సంపాదిస్తూ ముందుకు దూసుకుపోతుంది.ప్రస్తుతం ఈమె చేతిలో 5 సినిమాలు ఉన్నాయి, అందులో మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలున్నాయి.