
Villain Ravi Kishan : భోజపురి లో సూపర్ స్టార్ గా ఎదిగి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు రవి కిషన్.ఈయన టాలీవుడ్ లో రేస్ గుర్రం సినిమాలో ‘మద్దాలి శివారెడ్డి’ పాత్ర ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు.ఈ సినిమా ఇక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో రవి కిషన్ కి టాలీవుడ్ లో మరికొన్ని సినిమాల్లో విలన్ గా నటించే ఛాన్స్ దక్కింది.
అలా పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ బాషలలో నటిస్తూ ఫుల్ బిజీ గా ఉన్న రవి కిషన్, రాజకీయంగా కూడా రాణించాడు.బీజేపీ పార్టీ తరుపున గోరఖ్ పూర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి భారీ మెజారిటీ తో గెలుపొందాడు. ఒకసారి సినిమాల్లో స్టార్ ఎదిగాక ఆ తలపొగురు తలకెక్కిందని రవికిషన్ తాజాగా బయటపెట్టాడు. స్టార్ డమ్ తో గర్వాన్ని తలకెక్కించుకోవద్దని ఓ సంఘటన తనకు గుణపాఠం చెప్పిందని రవికిషన్ తాజాగా బయటపెట్టాడు.
ఓ షోలో మాట్లాడిన రవికిషన్.. ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమా కోసం నన్ను నటించాలని సంప్రదించారు. నేనేమో పెద్ద స్టార్ ను అన్న గర్వంతో .. రోజూ పాలతో స్నానం చేస్తా. గులాబీ పూల రెక్కలపై నిద్రిస్తా.. అవన్నీ మీరే ఏర్పాటు చేయాలని చెప్పాను. ఎందుకంటే నేను స్టార్ ను.. ఇలాంటివి మినిమమ్ ఉండాలి కదా అన్న భమలో బతికాను. అప్పుడు జనాలు నా గురించి మాట్లాడుకుంటారని ఊహించాను. కానీ నేను అనుకుంది ఒకటైతే జరిగింది మరొకటి.. నన్ను గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాలో తీసుకోలేదు. నా కోసం 25 లీటర్ల పాలు ఏర్పాటు చేయడం అసాధ్యమని నన్ను పీకేశారు’ అని తెలిపాడు.

ఇలాంటి డిమాండ్లతో తనకు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. అప్పటి నుంచి బుద్ది తెచ్చుకొని అలాంటి డిమాండ్ చేయడం మానేశాను. ఏమీ లేని స్థాయి నుంచి సడెన్ గా డబ్బు, పేరు ప్రతిష్టలు వచ్చినప్పుడు మనసును నియంత్రించడం కష్టం.. ముంబై లాంటి నగరం ఎవరినైనా పిచ్చోళ్లను చేస్తుంది. నేనూ అలానే అయ్యాను. నియంత్రణ కోల్పోయాను అని రవికిషన్ తనకు స్టార్ డమ్ తో వచ్చిన తలపొగరు నుంచి పశ్చాత్తాపడ్డట్టు తెలిపారు.
భోజ్ పురిలో పాపులర్ హీరో అయిన రవికిషన్ అనంతరం తెలుగులో రేసుగుర్రంతో ఫేమస్ అయ్యాడు. కన్నడ, హిందీభాషల్లో నటించాడు. ఇప్పటికీ కీలక పాత్రల్లో నటిస్తూనే ఉన్నాడు.