
Upasana : మెగా పవర్ స్టార్ రాం చరణ్ సతీమణి ఉపాసన సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కాకపోవచ్చు. కానీ ఆమెను సెలబ్రెటీగానే గుర్తిస్తారు. అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ గానూ, ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నిత్యం వార్తలోకెక్కుతారు. ఇటీవల ఉపాసనను కొన్ని విషయాలపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వీటిపై ఆమె షాకింగ్ రిప్లై ఇచ్చారు. తన గురించి తెలియని వారే ఇలా కామెంట్లు చేస్తారని అంటున్నారు. అంతేకాకుండా కొందరు నా అందంపై కూడా మాట్లాడారని, వారికి నేను ఒక్కటే చెబతున్నానంటూ కొన్ని విషయాలను ఆమె మీడియాతో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
రాం చరణ్, ఉపాసన పెళ్లి కాకముందే స్నేహితులు. పలు సందర్భాల్లో వీళ్లు కలుసుకోవడం వల్ల ప్రేమించుకొని పెద్దల ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు. అయితే చరణ్, నేను ప్రాక్టికల్ గా ఆలోచిస్తామని ఉపాసన చెబుతున్నారు. మేం పెళ్లి చేసుకోకముందు నన్న చరణ్ ‘నువ్వు ప్రేమలో పడడం కాదు.. ప్రేమలో వికసిస్తుంటావ్’ అని చెప్పిన తరువాత ఎగ్జైట్మెంట్ గా ఫీలయ్యాను అప్పటి నుంచి చరణ్ తో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి చరన్ నుంచి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నానని అన్నారు. ప్రతీ విషయంలో చరణ్ నాకు జడ్జి చేస్తూనే ఉంటారని అన్నారు. అందరి జీవితాల్లో ఇలాంటి భర్త ఉంటారో లేదో తెలియదు గానీ.. చరణ్ నాకు జీవిత భాగస్వామిగా రావడం నా అదృష్టం అని అన్నారు.
ఇక తన శరీరాకృతిపై కొందరు ఏదేదో మాట్లాడుతున్నారని ఉపాసన అన్నారు. కొందరు తనను అందంగా లేరని, లావుగా ఉన్నారని, డబ్బు కోసమే రాం చరణ్ ను పెళ్లి చేసుకున్నావని కామెంట్ చేశారు. వాళ్ల కామెంట్స్ కు నాకు కోపం రావడం లేదని, వాళ్లకు నా గురించి తెలియకనే అలా అన్నారని చెప్పారు. చిన్నప్పటి నుంచి నన్ను ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. కానీ నేనెప్పుడూ కుంగిపోలేదు. ప్రతీ విమర్శపై ఆలోచిస్తూ వారికి చెంపపెట్టులా నా పని చేసుకుంటూ ముందుకెళ్తున్నానని అన్నారు.

జీవితంలో మనపై విమర్శలు వచ్చినప్పుడు వాటిని తీసుకోవడంలో ఓ విధానం ఉంటుంది. నేను కూడా ఆ విధానాన్ని పాటించాను. విమర్శలకు నోళ్లు మూయించేలా చాపియన్ గా మారా. మరింత ధైర్యవంతురాలినయ్యాననే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు నా విషయంలో నేనేంతో ఆనందంగా ఫీలవుతున్నా. అయితే విమర్శకులకు నేనొక్కటే చెబుతున్నా.. ఎదుటి వారి అందం గురించి మాట్లాడేటప్పడు తామెలా ఉన్నారో ఒకసారి తెలుసుకున్న తరువాత విమర్శించండి.. అప్పుడే మానవ విలువలు అర్థమవుతాయి.. అని ఉపాసన చెప్పడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది.