
Romance in Bedroom : వైవాహిక బంధంలో శృంగారానిదే కీలకం. భార్యాభర్తల మద్య శృంగారంతోనే ప్రేమానురాగాలు పెరుగుతాయి. వారిలో సంసార సుఖం లేకపోతే వ్యర్థమే. అందుకే అందరు శృంగారాన్ని బంగారంలా భావిస్తారు. భాగస్వామిని సుఖపెట్టే క్రమంలో ఎన్నో మార్గాలు అన్వేషిస్తారు. తమ సుఖం కోసం వారు తాపత్రయ పడటంలో తప్పు లేదు. శృంగారంలో విసుగు ఉండకూడదు. శృంగారంలో అనుభూతి పొందాలి. ఇద్దరు పతాక స్థాయికి చేరితేనే అందులో మజా వచ్చేది. అంతేకాని ఏదో తూతూ మంత్రంలా చేస్తే ఇద్దరిలో అసంతృప్తి కలుగుతుంది. దీంతో సంసారం కకావికలం అవుతుంది. ఇద్దరి మధ్య అపార్థాలు, అనుమానాలు చెలరేగి గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయి.
ఇద్దరి మధ్య అవగాహన
జీవిత భాగస్వామిని సుఖపెట్టే క్రమంలో ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉండాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. తాము ఎక్కువ అనే ఆధిపత్యం ఇక్కడ పనిచేయదు. బండి బాగా నడవాలంటే రెండు ఎడ్లు సమానంగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఇలా దంపతులు చక్కని అవగాహనతో శృంగారంలో పాల్గొంటే విజయం వారిదే. భాగస్వామి ఎలా చేస్తే మంచి రసానుభూతి పొందుతుందో తెలుసుకుని మరీ వారి ఇష్టానుసారం ప్రవర్తిస్తే విజయం సాధించడం జరుగుతుంది. కానీ ఇక్కడ కూడా ఇగోలకు పోతే ఇక కష్టమే.
ఫోర్ ప్లే తప్పనిసరి
భాగస్వామిని దగ్గరకు తీసుకుని ఫోర్ ప్లే చేయాలి. శృంగారానికి ముందు శరీర భాగాలను తాకాలి. ఎక్కడ తాకితే అనుభూతి పొందుతారో తెలుసుకుని తాకేందుకు ప్రయత్నించాలి. అప్పుడే శరీరంలో శృంగార వీణలు మోగుతాయి. భాగస్వాములిద్దరూ ఒక్కటైతే ఇక ప్రపంచమే మీ దాసోహం అవుతుంది. అలా భాగస్వామిని సంతోష పెట్టేందుకు ప్రయత్నించాలి. అప్పుడే శృంగారంలో ఎక్కడికో వెళ్లి ఏదేదో చేయడం జరుగుతుంది. ఫలితంగా భాగస్వామిలో ఉత్సాహం ఉరకలేస్తుంది.

పడక గదిలో..
పడక గదిలో రెచ్చిపోవడానికి కావాల్సిన వాటిని సమకూర్చుకోండి. గదిలో వెలుతురు లేకుండా చూసుకోండి. ఒక వేళ వెలుతురు ఉంటే కళ్లకు గంతలు కట్టుకుని శృంగారంలో పాల్గొనండి. అందులో ఉండే మజా మీకే అర్థమవుతుంది. శృంగారంలో మన కదలికలు ఎలా ఉండాలో భాగస్వామిని అడిగి తెలుసుకోండి. తప్పు లేదు ఆమెకు ఎంత ఒత్తిడి జరిగితే ఎంజాయ్ అనిపిస్తుందో తెలుసుకుని అంత మేర ఉండేలా చూసుకోండి. ఇలా ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకుంటే శృంగారంలో బోరు ఉండదు. మంచి అనుభూతి పొంది జీవితాన్ని నందనవనంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. దానికి అందరు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు రావడం సహజమే.