Florida: ముక్కులో 150 పురుగుల పుట్ట!

ఓ వ్యక్తి విపరీతమైన రక్తస్రావంతో వారం రోజుల కిందట హెచ్సీఏ ఫ్లోరిడా మెమోరియల్ ఆసుపత్రికి వెళ్ళాడు. ముక్కులో విపరీతంగా నొప్పి పుడుతుందని.. రక్తస్రావం జరుగుతోందని సంబంధిత వ్యక్తి చెప్పడంతో ఈ ఎన్ టి వైద్యుడు డేవిడ్ కార్ల సన్ అతడిని పరీక్షించాడు.

Written By: Dharma, Updated On : February 23, 2024 1:20 pm

Florida

Follow us on

Florida: సాధారణంగా ఒంటిపై పురుగు పాకితే అసహ్యం వేస్తుంది. వెంటనే దానిని తొలగించే వరకు మనకు నిద్ర పట్టదు. అటువంటిది 150 పురుగులు ఓ వ్యక్తి ముక్కులో కాపురం పెడితే.. ఆ విషయం ఆయనకు తెలియకపోతే.. దానిని ఏమంటారు? మీరు వింటున్నది నిజమే. అమెరికాలో వెలుగు చూసింది ఈ ఘటన. ఫస్ట్ కోస్ట్ న్యూస్ ప్రకారం రోగికి చెందిన వివరాలు రహస్యంగా ఉంచారు.అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.

ఓ వ్యక్తి విపరీతమైన రక్తస్రావంతో వారం రోజుల కిందట హెచ్సీఏ ఫ్లోరిడా మెమోరియల్ ఆసుపత్రికి వెళ్ళాడు. ముక్కులో విపరీతంగా నొప్పి పుడుతుందని.. రక్తస్రావం జరుగుతోందని సంబంధిత వ్యక్తి చెప్పడంతో ఈ ఎన్ టి వైద్యుడు డేవిడ్ కార్ల సన్ అతడిని పరీక్షించాడు. ముక్కు లోపలి భాగాన్ని పరిశీలించాడు. ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. కదిలాడుతున్నట్లు పురుగులు కనిపించాయి. నేరుగా కెమెరా పెట్టి గమనించేసరికి పురుగుల పుట్ట కనిపించింది. ఆ పురుగులు ముక్కులో చర్మాన్ని తింటున్నట్లు గుర్తించారు. అయితే ఇంత జరుగుతున్నా బాధిత రోగికి మాత్రం ఈ విషయం తెలియక పోవడం విశేషం. గత కొద్దిరోజులుగా ముక్కు నొప్పితో ముఖం వాచిపోయిందని.. మాట్లాడేందుకు కూడా ఇబ్బంది పడుతున్నానని.. ముఖం మీద నిప్పుల వర్షం పడినట్లు ఉంటుందని బాధితరోగి వైద్యుడికి చెప్పాడు.

దీంతో అప్రమత్తమైన డాక్టర్ కార్ల సన్ ఆపరేషన్ చేయడం ప్రారంభించారు. ముక్కులో నుంచి బతికి ఉన్న 150 పురుగులను బయటకు తీశారు. మరి కొద్ది రోజులపాటు ఇలానే పురుగులు ఉంటే సదరు వ్యక్తి చనిపోతారని.. ముందుగా లార్వాలపై ప్రభావం చూపి కంటి చూపు పోతుందని డాక్టర్ చెప్పుకొచ్చారు. అయితే అమెరికా చరిత్రలోనే ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని ఆ వైద్యుడు చెబుతుండడం విశేషం. ఇన్ఫెక్షన్ గురించి ఏదో రూపంలో తెలుసుకుని ఉంటాం కానీ.. ఏకంగా 150 పురుగులు ముక్కులో దాగొని ఉండడం ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని వైద్యుడు చెబుతుండడం గమనార్హం.