Sticker On Fruits: మార్కెట్లో రకరకాల పండ్లు ఉంటాయి. మన శరీరానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే పండ్లు రోజువారీగా తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. పోషకాహారంలో పండ్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. మనం తీసుకునే ఆహారంలో పండ్లు ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. దీన్ని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. పండ్లను తింటుంటే మనకు బలం కలుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా చేయడంలో పండ్లు సాయపడతాయి. రోజు ఉడికించిన వాటిని కాకుండా ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు చేర్చుకోవడం ఉత్తమం. పండ్లు తీసుకోవడం వల్ల మనకు ఎన్నో రకాలుగా లాభాలు కలుగుతాయి.

ఇటీవల కాలంలో మార్కెట్లో లభించే పండ్లపై స్టిక్కర్లు అంటిస్తున్నారు. దీంతో వినియోగదారులు వాటిని నాణ్యత కలిగినవిగా భావిస్తున్నారు. స్టిక్కర్లు అంటించిన పండ్లు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నవిగా అనుకుంటున్నారు. కానీ ఇందులో వాస్తవం లేదు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఏఐ) వెల్లడించిన నిజాలు విస్తుగొలుపుతున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో పండ్లు, కూరగాయలపై ఇలా స్టిక్కర్లు అతికిస్తారు వాటిని నాణ్యత, ధర, పండును ఎలా పండించారనే సమాచారం ఇస్తుంటారు. కానీ మన దేశంలో మాత్రం ఇలాంటి స్టిక్కర్లు ఉంటే దాన్ని నాణ్యతగా భావించొద్దని సూచిస్తోంది.
మన దేశంలో నాణ్యతకు పెద్దపీట వేయడం లేదు. దీంతో ఊరికినే స్టిక్కర్లు వేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. స్టిక్కర్లు ఉన్న వాటిని మంచివిగా అనుకుంటే పొరపాటే. స్టిక్కర్లు ఉన్న పండ్లు కొనుగోలు చేస్తూ అవేవో మంచికి సంకేతాలని భావించడం సమంజసం కాదని చెబుతున్నారు. స్టిక్కర్లు చూసి మోసపోవద్దు. వ్యాపారులు మనల్ని పక్కదారి పట్టించేందుకే ఇలా చేస్తున్నారని సూచిస్తోంది. ఎప్పుడైనా స్టిక్కర్లు వేసిన పండ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించకపోవడమే మంచిది.

స్టిక్కర్లు ఉన్న పండ్లు ఇతర నగరాలు, రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యాయని అనుకోవడం సహజమే. కానీ ఇందులో నిజం లేదు. స్టిక్కర్లు వేస్తూ పండ్లు నాణ్యత గలవని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది వాస్తవం కాదు. అందుకే స్టిక్కర్లు చూసి మోసపోవద్దు. ఏ పండు అయినా ఇక్కడ పండేదే. దీంతో మనం స్టిక్కర్లు ఉన్న వాటిని ఏదో శక్తి ఉన్న వాటిగా చూడకూడదు. ఏ రకమైన పండు అయినా తాజాగా ఉన్నవి తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. మనం తినడం వల్ల ఆరోగ్యం మెరుగు పడేందుకు పండ్లు ఉపయోగపడతాయి.