Planes Colour: మనం ఏదైనా దేశం వెళ్లాలంటే విమానం ఎక్కాలి. విమానాలు అన్ని కూడా తెలుపు రంగులోనే ఉంటాయి. అన్ని విమానయాన సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా విమానాలు నడిపిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో విమానయన సంస్థలు వేరు వేరు రంగులు, ఆకృతులు ఉపయోగిస్తున్నాయి. కానీ ఎక్కువ భాగం మాత్రం తెలుపు రంగులోనే ఉండటం గమనార్హం. ఇప్పటికి విమానాలు తెలుపు రంగులోనే కనిపిస్తున్నాయి. అసలు విమానాలు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? వాటికి తెలుపు రంగు వేయడానికి గల కారణాలేంటి? అనే విషయాలపై పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. విమానాలకు తెలుపు రంగు వేయడంలో శాస్త్రీయ కోణాలు కూడా దాగి ఉన్నాయి.

విమానాలు రూపొందించే తయారీదారులు మెటల్ లేదా క్లోమ్ ను ఉపయోగిస్తారు. దీంతో రెక్కలకు త్వరగా మురికి, దుమ్ము, తుప్పు పడుతుంటాయి. ప్రయాణికుల నుంచి మంచి ఇంప్రెషన్ పడేందుకు విమానాలను లేత రంగుల్లో తయారు చేసినా తెలుపు రంగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఎక్కువగా విమనాలను తెలుపు రంగులోనే పెయింట్ వేస్తున్నారు. శాస్త్రీయ, ఆర్థిక కోణాల్లో చూసినా వాటికి తెలుపు రంగు ఉత్తమమైనదిగా భావిస్తున్నారు. సూర్యకాంతిని తెలుపు రంగు తొందరగా గ్రహించదు.
దీంతో విమానం వేడెక్కడానికి ఆస్కారం ఉండదు. అందుకే విమానాలకు తెలుపు రంగు వేస్తున్నారు. మరోవైపు సోలార్ రేడియేషన్ ప్రభావం పడకుండా తెలుపు రంగు రక్షిస్తుంది. ఎండ వేడి కూడా విమానాలపై పడకుండా చూసుకుంటుంది. ఏదైనా సమస్య వచ్చినా సులభంగా గుర్తించవచ్చు. అందుకే విమానాలకు తెలుపు రంగు వేస్తున్నారని చెబుతున్నారు. విమానాలకు మొదటి నుంచి కూడా తెలుపు రంగును వేస్తూ ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు. శాస్త్రీయ కారణాలతోనే వాటికి తెలుపు రంగును వేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుపు రంగు అందానికి ప్రతీకగా నిలుస్తుంది. ఏ రంగు వేసినా రాని అందం తెలుపు రంగులో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం శాస్త్రీయ కోణాల్లో తీసుకుని కూడా వాటికి తెలుపు రంగే వేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు తెలుపు రంగులోనే తయారు చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ముందుంటోంది. దీంతో తెలుపు రంగు విమానాల తయారీకే సంస్థలు నిర్ణయించుకుని ఆ రంగు వేయడంలో ముందు నిలుస్తున్నాయి.