
Natu Natu Song Shooting: నాటు నాటు పాట ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా నిలిచింది. మన థియేటర్లే కాదు.. అమెరికాలోని డాల్బీ థియేటర్ ను కూడా ఒక ఊపు ఊపింది.. మరి ఇంతటి నాటినాటు పాట వెనుక జరిగిన కథ మీకు తెలుసా? ఈ పాటను ఎక్కడ చిత్రీకరించారో తెలుసా? ఇప్పుడు ఆ దేశం ఎలా ఉందో తెలుసా?
ఆర్ఆర్ఆర్ లో ” నాటు నాటు” పాట మొన్న ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని దక్కించుకుంది. నేడు ఆస్కార్ అవార్డును దక్కించుకుంది.
దీంతో ఆ చిత్ర బృందం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. అంతేకాదు తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడుతున్నారు.. కానీ “నాటు నాటు” పాట కోసం ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఈ పాటలో ఫర్ఫెక్షన్ కోసం దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్, తారక్ ను రాచి రంపాన పెట్టాడు.
ఉక్రెయిన్ లో చిత్రీకరించారు
నాటు నాటు పాటను ఉక్రెయిన్ దేశంలో చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరించే ముందు అక్కడ ఇంకా యుద్ధం ప్రారంభం కాలేదు. ఇక ఆ పాటలో తారక్, వెనుక కనిపించే కోట ఆ దేశ అధ్యక్షుడి అధికారిక నివాసం. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం అడగగానే పాట కోసం ఎటువంటి షరతులు పెట్టకుండా ఇచ్చేశారు.. అయితే ఈ పాటలో హుక్ స్టెప్ కోసం ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన మూమెంట్స్ ఆడియన్స్ కు బాగా నచ్చాయి.. ఆడియన్స్ ఎంజాయ్ చేయాలంటే డ్యాన్స్ మాస్టర్ చేసిన స్టెప్స్ ను యాజ్ ఇట్ ఈజ్ గా హీరోలు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన దానికంటే తారక్, ఎన్టీఆర్ ఎక్కువ చేశారు కాబట్టే ఆ పాట అంత సూపర్ హిట్ అయింది.

చాలా టేకులు తిన్నారు
సాధారణంగా చరణ్, తారక్ సింగిల్ టేక్ లోనే సీన్ చేసేస్తారు. ఇక డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వారికి నాటు నాటు పాట పరీక్ష పెట్టింది. ఈ పాటలో 80 కి పైగా వేరియేషన్ స్టెప్ లను ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేశారు.. తారక్, చరణ్ 18 కి పైగా టేకులు తిన్నారు. ఇన్ని టేకులు తీసుకున్నప్పటికీ… రెండో టేకును రాజమౌళి ఓకే చేశారు.. ఇక చంద్రబోస్ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, భైరవ పాడారు.. తన గాత్రంతో ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. కీరవాణి కంపోజ్ చేశారు. ప్రస్తుతం ఆస్కార్ పురస్కారం రావడంతో ఈ చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది.. అంతేకాదు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఈ పాటను డాల్బీ థియేటర్లో పాడి ఆహుతులను అలరించారు.
#RRRMovie composer M. M. Keeravani accepts the original song #Oscar for “Naatu Naatu” and graces the audience with a tune of his own. https://t.co/hxuR41IpLt pic.twitter.com/t4pbTwAE1M
— Los Angeles Times (@latimes) March 13, 2023