Google Search: 2023 లో గూగుల్ లో ఎక్కువగా ఏం సెర్చ్ చేశారో తెలుసా..?

గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్లేస్ లో ఇది మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ అందమైన వాస్తు శిల్పాలు, బౌద్ధ పగోడాలు, చారిత్రాక అవశేషాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.

Written By: Suresh, Updated On : December 12, 2023 3:27 pm

Google Search

Follow us on

Google Search: మరి కొద్ది రోజుల్లోనే 2023 సంవత్సరం ముగుస్తుంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ ఈ ఏడాది ఏం చేశాం… ఎక్కడకు వెళ్లాం.. అనే విషయాలపై ఆలోచన చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సెర్చ్ చేసిన విషయాల్లో టాప్ టెన్ స్థానాల్లో నిలిచిన అంశాలపై గూగుల్ ఓ ప్రకటన చేసింది. గూగుల్ లో ఎక్కువగా సెర్చ చేసిన పర్యాటక ప్రాంతాలను విడుదల చేసింది.

అయితే గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్లేసేస్ ఏంటి? జనాలు ఎక్కడికి వెళ్లడానికి మొగ్గు చూపారన్న విషయాలను మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వియత్నాం.. గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్లేస్ లో ఇది మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ అందమైన వాస్తు శిల్పాలు, బౌద్ధ పగోడాలు, చారిత్రాక అవశేషాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. తరువాత గూగుల్ లో వెతికిన పర్యాటక ప్రాంతంగా గోవా నిలిచింది. గోవా సముద్ర తీర ప్రాంతాలతో పాటు చారిత్రక కట్టడాలు ఇక్కడ టూరిస్టులను ఆకట్టుకుంటాయి.. తరువాతి స్థానంలో బాలి నిలిచింది. ఇక్కడ పచ్చదనం పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పచ్చని అడవులు, జాలువారే జలపాతాలు జనాలను మంత్రముగ్ధులను చేస్తాయి. అలాగే బీచ్ లు చాలా అందంగా ఉంటాయట. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో బీచ్ లో అందాలను చూడటానికి కళ్లు సరిపోవు.

అలాగే శ్రీలంక.. అందమైన ద్వీప దేశాల్లో శ్రీలంక ఒకటని చెప్పుకోవచ్చు. బీచ్ లు, అందమైన జలపాతాలు, పచ్చని అడవులకు నెలవైన ప్రాంతం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తుంది.

గూగుల్ వెతికిన ఇతర పర్యాటక ప్రాంతాల్లో థాయిలాండ్, కశ్మీర్, కూర్గ్, ఇటలీ, స్విట్జర్లాండ్ మరియు అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయని గూగుల్ వెల్లడించింది.