
Husband And Wife Relationship: ఆధునిక కాలంలో కుటుంబ బంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. డబ్బులుంటే ఒకలాలేకపోతే మరోలా చూస్తున్నారు. దీంతో మానవ సంబంధాలు కాస్త మనీ సంబంధాలుగా అయిపోతున్నాయి. దీనికి కారణం డబ్బు మీద వ్యామోహమే. ఎంత సంపాదించినా ఆశ చావడం లేదు. ఇంకా సంపాదించాలనే యావతో అన్ని సుఖాలను త్యజిస్తున్నారు. దీంతో రిలేషన్ షిప్ పక్కదారి పడుతోంది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి.
అనుమానం
ప్రేమకు నమ్మకం పునాది అనుమానం సమాధి. జీవిత భాగస్వామిపై అనుమానం ఉంటే అది కొండంత అవుతుంది. ఇద్దరి మధ్య విభేదాలకు కారణమవుతుంది. ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండాలంటే అనుమానమనే పెనుభూతాన్ని తరమేయాలి. అప్పుడే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడటానికి సాయపడుతుంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది.
అన్యోన్యత
ఇద్దరి మధ్య అన్యోన్యత పెరగాలి. ఒకరిపై మరొకరికి ప్రేమ ఉండాలి. అప్పుడే ఇద్దరి మధ్య మంచి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. అది చిరకాలం ఉండేందుకు దోహదం చేస్తుంది. ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే ఎలాంటి గొడవలు రావు. విభేదాలు అసలు పుట్టవు. ఇద్దరిలో మంచి అభిప్రాయాలు ఉండాలి. అప్పుడే వారి సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతుంది.

ఒకరిపై మరొకరికి విశ్వాసం
ఇద్దరి మధ్య విశ్వాసం ఉండాలి. ఒకరు చేసే పనిని మరొకరు స్వాగతించాలి. ఇద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ కు ఇది ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఇలా ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా ఉంటే మంచి సంబంధం ఏర్పడుతుంది. చేసే పనులను కూడా పంచుకుంటే ఇంకా మంచిది. ఇద్దరికి శ్రమ లేకుండా ఉంటుంది. ఇలా ఒకరంటే మరొకరికి ఎంతో విశ్వసనీయత ఉంటే ఏదైనా సాధ్యమే.
ఇగోలు పక్కన పెట్టాలి
దంపతుల్లో ఉండకూడనిది ఇగో. ఇది ఉంటే అంత త్వరగా ఏ విషయం కూడా ఒప్పుకోరు. తన మాటే నెగ్గాలని పంతం పట్టుకుని కూర్చుంటారు. ఇది సరైంది కాదు. ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉండాలంటే ఇగోలకు దూరంగా ఉండాలి. దీంతోనే ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జీవించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇలా దంపతులు పది కాలాల పాటు మంచిగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. జీవిత భాగస్వామిని ప్రేమగా చూసుకోవాల్సిందే.