
Teeth Health Tips: మనం ఎవరితోనైనా మాట్లాడితే వారిలో పళ్ల వరుసనే చూస్తాం. వారు మాట్లాడుతుంటే ఎదుటి వారు పళ్లనే గమనిస్తుంటారు. అలాంటి పళ్లు ముత్యాల్లా మెరిస్తే బాగుంటుంది. చూడాలనుకునే వారికి ఉత్సాహం కలిగిస్తుంది. మన ముఖ వచ్ఛస్సు పళ్లతోనే కనిపిస్తుంది. అందుకే వాటిని తెల్లగా ఉంచుకునేందుకు అందరు ఇష్టపడుతుంటారు. కానీ కొందరు గుట్కా లాంటివి నమలడం వల్ల పళ్లు ఎర్రగా మారతాయి. పసుపు వర్ణంలో చూడటానికి చండాలంగా ఉంటాయి. దీంతో వారు నలుగురిలో మాట్లాడటానికి ఇష్టపడరు.
చాలా మంది గార పళ్లు పసుపు రంగులో ఉండటం వల్ల వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. గార పట్టిన పళ్లను ఎలా బాగు చేసుకోవాలో తెలియక తికమకపడుతుంటారు. చిగుళ్లు ఆరోగ్యంగా బలంగా ఉంటే మెరిసిపోతాయి. దీంతో మన పళ్లు ఎదుటి వారికి కడా ముచ్చట గొలుపుతాయి. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మన గార పళ్లు బాగుపడేలా చేసుకోవచ్చు. పళ్లను తెల్లగా ఉంచుకుంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీనికి అందరు చొరవ చూపాల్సిందే.

పళ్లు తెల్లగా కావడానికి ఓ అద్భుతమైన చిట్కా ఉంది. ఒక బౌల్ లో నాలుగు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి దానిలో ఒక టీ స్పూన్ టమోటా రసం కొంచెం టూత్ పేస్ట్, పావు స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి బ్రష్ తో రెండు నిమిషాలు పళ్లు తోముకోవాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే పళ్ల మీద ఉన్న పసుపు వర్ణం తొలగిపోయి పళ్లు తెల్లగా మారుతాయి. ఇలా పళ్లకు ఉన్న తుప్పును వదిలించుకునే చిట్కాను పాటించి మన పళ్లు తెల్లగా మారేలా చేసుకోవచ్చు. దీనికి గార పళ్లు ఉన్న వారు పాటిస్తే చక్కని ఫలితం ఉంటుంది.
తెల్లగా పళ్లు మెరిస్తేనే చూడ్డానికి బాగుంటుంది. గార పట్టిన పళ్లు చూడటానికి బాగుండదు. ముత్యాల్లాంటి పళ్ల వరస చూడ్డానికి ముచ్చటగా అనిపిస్తుంది. దీంతో పళ్లు తెల్లగా ఉండేలా చూసుకోవాలి. ఫ్లోరైడ్ ప్రభావం ఉంటే పళ్లు గారగా అవుతాయి. నీళ్ల ప్రభావం కూడా పళ్లపై ఉంటుంది. ఈ నేపథ్యంలో మన పళ్లు బాగుండేలా చూసుకోవాలి. గార పట్టకుండా తెల్లగా మెరిసేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. దానికి పైన చెప్పిన చిట్కా పాటించి పళ్లు తెల్లగుండేలా చొరవ తీసుకోవాల్సిందే.