Love Marriage: మన తలరాతను మార్చేది చేతిలోని గీతలు కాదు మన చేతలే. జీవితంలో ఎదగాలంటే కష్టపడి పనిచేయాలి. అవాంతరాలను దాటుకుని ముందుకు కదలాలి. అంతే కానీ ఏదో మన అదృష్టం అంటూ పోతే అంతే సంగతి. కొందరు చిన్న విషయాలనే భూతద్దంలో పెట్టి చూసుకుంటారు. జీవితంలో ఏదో జరిగిపోతోందని ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారు జీవితంలో ముందుకు పోలేకపోతూ తమ గతికి విధి వైపరీత్యమే అని నిందిస్తుంటారు. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకుని కుమిలిపోతూ జీవితాన్ని మధ్యలోనే వదిలేస్తున్నారు.

కర్ణాటకలోని రామనగర జిల్లాలో శివనంజ, శ్వేత భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వీరికి నలుగురు సంతానం. బేకరీలో పనిచేసే శివనంజ భార్యా పిల్లలను అపురూపంగా చూసుకుంటున్నాకుటుంబంలో అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు వచ్చేవి. అదే అలవాటుగా మారడంతో రోజు తగాదాలు వచ్చినా మళ్లీ సర్దుకు పోయేవారు. రెండు నెలల క్రితం వారు మళ్లీ ఓ బిడ్డకు జన్మనిచ్చారు.
Also Read: RRR Movie First US Review: ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ యూఎస్ రివ్యూ
ఈ క్రమంలో పెద్ద కుమారుడితో తండ్రి గుడికి వెళ్లి వచ్చారు. అక్కడ ప్రసాదం తీసుకురాలేదని భార్య ఆగ్రహించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో భర్తను భయపెట్టాలని భావించి భార్య బెడ్ రూంలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చిన్న విషయానికే ఇలా చేయడంతో అందరు షాక్ కు గురయ్యారు. గొడవ జరిగిన తరువాత భర్త ఇదంతా మామూలే అని పెద్ద కొడుకును తీసుకుని బయటకు వెళ్లాడు.

అతడు వెళ్లగానే ఆమె చిన్న కుమారుడిని పక్కన పడేసి ఉరేసుకుని తనువు చాలించింది. పిల్లవాడి ఏడుపు విని చుట్టుపక్కల వారు వచ్చి చూసే సరికి ఆమె విగతజీవిగా మారింది. దీంతో అందరు కంగారు పడ్డారు. మామూలు గొడవను కూడా తట్టుకోలేని ఆమె సున్నిత మనస్తత్వానికి అందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల చిన్నారిని వదిలేసి ఆమె తన దారి తాను చూసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శ్వేత మిగతా ఇద్దరు పిల్లలు ఆమె పుట్టింట్లో ఉన్నారు.
Also Read: టీఆర్ ఎస్ నేతల్లో ఐటీ దాడుల గుబులు.. కేంద్రం గట్టిగానే డిసైడ్ అయిందా…?