Christmas Trees : క్రిస్మస్ పండుగ దేశంలో ఇప్పటికే ప్రారంభమైంది. ఈ పండుగ వస్తుందంటే.. అందరికీ కూడా కేక్‌లు, శాంటా గిఫ్ట్‌లు, క్రిస్మస్ ట్రీలు గుర్తుకు వస్తాయి. ఇళ్లు, ఆఫీసులు ఇలా ఎక్కడ చూసిన కూడా క్రిస్మస్ ట్రీలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రతీ ఒక్కరూ ఇంట్లో క్రిస్మస్ ట్రీని పెడుతుటారు. వీటికి లైటింగ్, డెకరేషన్ వంటివి చేస్తుంటారు. వీటి ధర కూడా చాలా ఖరీదు ఉంటాయి. ఎంత ఖరీదైన కూడా క్రిస్మస్ సందర్భంగా కొన్ని రోజుల పాటు ఈ ట్రీలను పెడతారు. ఇవి చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. కొందరు క్రిస్మస్ ముందు నుంచి కేవలం రెండు నుంచి మూడు రోజుల పాటు సెట్ చేస్తారు. కానీ మరికొందరు మాత్రం దాదాపుగా పది రోజుల పాటు ఈ క్రిస్మస్ ట్రీని పెట్టుకుంటారు. అయితే ఈ ప్రపంచంలో అతిపెద్ద క్రిస్మస్ ట్రీలు ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదివేయండి.
ఐకానిక్ రాక్‌ఫెల్లర్ సెంటర్
ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రిస్మస్ చెట్టు ఐకానిక్ రాక్‌ఫెల్లర్ సెంటర్. న్యూయార్క్‌లో రాక్‌ఫెల్లర్ సెంటర్‌లో ఉన్న ఈ క్రిస్మస్ చెట్టు విలువ సుమారు 70 వేల డాలర్లు ఉంటుంది. దీన్ని 700 కంటే ఎక్కువ లైట్లతో అలంకరిస్తారు. క్రిస్మస్ పండుగన రోజున 24 గంటలు లైట్లు ఉంటాయి. న్యూఇయర్ రోజు ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ క్రిస్మస్ ట్రీ లైట్లు వెలుగుతూనే ఉంటాయి.
ప్యారిస్‌లోని గ్యాలరీస్ లఫాయెట్ డిపార్ట్‌మెంట్ స్టోర్ ట్రీ
ఈ ట్రీ కూడా ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైనది. ఇది ఒక మిరుమిట్లు గొలిపే ట్రీ. 1976 నుంచి ఇక్కడ క్రిస్మస్ ట్రీని పెడతారు. 20,000 ప్రోగ్రామబుల్ లైట్లు, ఫైబర్-ఆప్టిక్-ఫైర్‌వర్క్ ఎఫెక్ట్ లైటింగ్‌తో ఈ క్రిస్మస్ ట్రీని పెడతారు. ఈ ట్రీ దగ్గర ప్రతి 30 నిమిషాలకు కూడా ఒక సౌండ్ అండ్ లైట్ షో ఉంటుంది.
వాటిక్ క్రిస్మస్
రోమన్ కాథలిక్ చర్చిలోని వాటికన్ క్రిస్మస్ ట్రీ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ డిసెంబర్ 9 నుంచి జనవరి 7 వరకు ఈ ట్రీని ఉంచుతారు. అంటే దాదాపుగా 21 రోజులు ఉంటుంది. ఈ క్రిస్మస్ ట్రీని చూడటానికి చాలా మంది జనం తరలివెళ్తుంటారు. 1982 నుంచి ఈ క్రిస్మస్ ట్రీ పెట్టే సంప్రదాయం ప్రారంభమైంది.
ఎర్ర బంతులతో ట్రీ
మాడ్రిడ్‌లోని ప్యూర్టా డెల్ సోల్‌లో ఎర్ర బంతులతో క్రిస్మస్ ట్రీని నిర్మిస్తారు. దాదాపుగా 37 మీటర్ల ఎత్తులో 3,300 ఎర్ర బంతులతో తయారు చేస్తారు. ఇందులో 6,600 లైట్లు, 115 చెర్రీ చెట్లు, 11 పెద్ద ప్రకాశవంతమైన ఫిర్ చెట్లను కూడా అలంకరిస్తారు.
విండర్స్ కాజిల్
ఇంగ్లాండ్‌లో విండ్సర్ కాజిల్ అనే క్రిస్మస్ ట్రీని పెడతారు. ఇక్కడ 1,000 ఏళ్ల నుంచి పెడుతుంటార. క్రిస్మస్ ట్రీ ఇక్కడ దాదాపుగా 20 అడుగుల ఎత్తులో పెడతారట.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.