First Christmas Tree : దేశంలో క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే దేశంలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ అంటే అందరికీ కూడా కేక్‌లు, శాంటా గిఫ్ట్‌లు, క్రిస్మస్ ట్రీలు గుర్తుకు వస్తాయి. ఇళ్లు, ఆఫీసులు ఇలా ఎక్కడ చూసిన కూడా క్రిస్మస్ ట్రీలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రతీ ఒక్కరూ ఇంట్లో క్రిస్మస్ ట్రీని పెడుతుటారు. వీటికి లైటింగ్, డెకరేషన్ వంటివి చేస్తుంటారు. వీటి ధర కూడా చాలా ఖరీదు ఉంటాయి. ఎంత ఖరీదైన కూడా క్రిస్మస్ సందర్భంగా కొన్ని రోజుల పాటు ఈ ట్రీలను పెడతారు. ఇవి చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. కొందరు క్రిస్మస్ పండుగ ఉందంటే ఒక వారం రోజుల ముందు నుంచే వేడుక మొదలవుతుంది. అయితే ప్రతీ ఒక్కరూ కూడా ఇంట్లో క్రిస్మస్ ట్రీని పెడతారు. అయితే ఈ ప్రపంచంలో క్రిస్మస్ ట్రీ ఎలా మొదలైంది? ఫస్ట్ క్రిస్మస్ ట్రీ ఏది? అసలు ఎందుకు దీనిని స్టార్ట్ చేశారనే పూర్తి విషయాలు తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎంతో ఘనంగా ఈ పండుగను క్రిస్టియన్లు జరుపుకుంటారు. అయితే ప్రతి ఏటా డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను నిర్వహిస్తారు. ఈ రోజున యేసు క్రీస్తు జన్మించారని అందుకే ఈ పండుగను నిర్వహిస్తారట. అయితే క్రిస్మస్ పండుగకి తప్పకుండా క్రిస్మస్ టీని అలకరింస్తారు. ఇంటిని రంగు రంగుల లైట్లతో ఆ ట్రీకి కూడా డెకరేట్ చేస్తారు. అయితే ఈ క్రిస్మస్ ట్రీని మొదట గ్రీకులు, రోమన్లు ఇంట్లో అలకరించేవారట. ఈ ఆచారాన్ని కూడా వాళ్లే తీసుకొచ్చారని చెప్పుకుంటారు. గ్రీకులు, రోమన్లు శీతాకాలంలో ఇదే సమయంలో పండుగ నిర్వహించుకునేవారు. దీంతో వారు క్రిస్మస్ ట్రీని పెట్టేవారు. ఇలా క్రిస్టియన్లు క్రిస్మస్ ట్రీని నాటడం స్టార్ట్ చేశారు. ఇలా క్రిస్టియన్లు 16వ శతాబ్దంలో క్రిస్మస్ చెట్టును అలంకరించడం ప్రారంభించారు. అయితే మార్టిన్ లూథర్ అనే క్రిస్టియన్ డిసెంబర్ 24 సాయంత్రం అడవి గుండా వెళ్తుంటే.. మంచు సతత హరిత వృక్షం మీద పడుతుంది. దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. అలా కూడా క్రిస్మస్ ట్రీని నాటారని చెప్పుకుంటారు.
మరికొందరు క్రిస్మస్ ట్రీ గురించి వేరేలా చెప్పుకుంటారు. క్రీ.శ.722 లో క్రిస్మస్ చెట్టును అలకరించే ఆచారం జర్మనీలో ప్రారంభమైందని కొందరు అంటుంటారు. జర్మనీలోని సెయింట్ బోనిఫేస్‌కు ఇక పెద్ద చెట్టు ఉండేదట. ఈ చెట్టు కింద కొందరు పిల్లలను బలి ఇచ్చారట. దీంతో సెయింట్ బోనిఫేస్ ఆ చెట్టును నరికేస్తాడు. చెట్టును నరికేసిన తర్వాత దాని స్థానంలో ఒక అందమైన చెట్టు పెరిగిందని, దాన్ని మిరాకిల్ చెట్టుగా పిలిచేవారట. ఎందుకంటే ఆ చెట్టు కొమ్మలు స్వర్గానికి చిహ్నమట. దీంతో అక్కడి ప్రజలు యేసు క్రీస్తు పుట్టిన రోజున చెట్టును అలకరిస్తారు. ఇలా క్రిస్మస్ ట్రీ పుట్టిందని కథలుగా చెప్పుకుంటారు. మరి మీరు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారా? ఎందుకు క్రిస్మస్ ట్రీ జరుపుకుంటారో? కామెంట్ చేయండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.