https://oktelugu.com/

Siri Srihan: అసలైన ప్రేమ అంటే సిరి-శ్రీహాన్ లదే.. షణ్ముఖ్-దీప్తి సునయన వీరిని చూసి నేర్చుకోవాలా?

Siri Srihan: ప్రేమ అంటే ఒక్కరోజులో తరిగిపోయేది కాదు.. ప్రేమంటే అంతులేని సముద్రం లాంటిది. అందులో సేదతీరాలే కానీ మునిగిపోకూడదు. కొన్ని ప్రేమలు చీటికి మాటికి విడిపోతుంటాయి. ఇగో క్లాషెస్.. తల్లిదండ్రులతో ఒత్తిడితో కాంప్రమైజ్ అయిపోతారు. ఆ ప్రేమ నిజమైనది కాదని అర్థం. ఎందుకంటే ఎంతమంది వచ్చినా బంధాన్ని విడగొట్టదు ప్రేమ.. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో సిరీ-షణ్ముఖ్ హగ్గులు, రోమాన్స్ చూసి సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ ఆమెను వదిలేశాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 20, 2022 / 10:34 AM IST
    Follow us on

    Siri Srihan: ప్రేమ అంటే ఒక్కరోజులో తరిగిపోయేది కాదు.. ప్రేమంటే అంతులేని సముద్రం లాంటిది. అందులో సేదతీరాలే కానీ మునిగిపోకూడదు. కొన్ని ప్రేమలు చీటికి మాటికి విడిపోతుంటాయి. ఇగో క్లాషెస్.. తల్లిదండ్రులతో ఒత్తిడితో కాంప్రమైజ్ అయిపోతారు. ఆ ప్రేమ నిజమైనది కాదని అర్థం. ఎందుకంటే ఎంతమంది వచ్చినా బంధాన్ని విడగొట్టదు ప్రేమ.. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో సిరీ-షణ్ముఖ్ హగ్గులు, రోమాన్స్ చూసి సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ ఆమెను వదిలేశాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.. షణ్ముఖ్ తో అలా బిగ్ బాస్ లో రాసుకుపూసుకు తిరగడం వల్ల సిరిని శ్రీహాన్ దూరం పెట్టారని వీరి మధ్య క్లాషెస్ వచ్చాయని ప్రచారం సాగింది.

    Siri Srihan

    కానీ వాటన్నింటికి ఈ జంట తెరదించింది. వాలైంటెన్స్ డేను ఘనంగా జరుపుకుంది. ప్రేమికుల దినోత్సవం నాడు తన ప్రేయసి సిరికి కేక్ కట్ చేయించి ఒక హార్ట్ సింబల్ బెలూన్ ను ఇస్తూ తన ప్రేమను శ్రీహాన్ చాటాడు. తమ బంధం కేవలం బిగ్ బాస్ లో చూపించినదానికి విడిపోదని శ్రీహాన్ చూపించాడు. నిజమైన ప్రేమికుడు అనిపించాడు.

    Also Read: పూజాహెగ్డేకు సమంత కౌంటర్ అదిరిపోయిందిగా.. కోల్డ్ వార్ పీక్స్

    అదే సందర్భంలో షణ్ముఖ్-దీప్తి మాత్రం కేవలం సిరి వల్లనే విడిపోయారన్న ప్రచారం ఉంది. సిరితో షణ్ముఖ్ అలా బిగ్ బాస్ లో ప్రవర్తించడం వల్ల దీప్తి తల్లిదండ్రులు సీరియస్ అయ్యి వీరి బ్రేకప్ కు దారితీసిందని టాక్ నడుస్తోంది.

    అయితే నిజమైన ప్రేమికుడు శ్రీహాన్ మాత్రం అదే సిరి విషయంలో ఇలా ప్రవర్తించలేదు. గొప్పగా ఆలోచించాడు. బిగ్ బాస్ లోని ఎమోషన్ ను మాత్రమే చూశాడు. కేవలం షణ్ముఖ్ , సిరిల ఫ్రెండ్ షిప్ ను మాత్రమే గమనించాడు. తప్పితే వారి మధ్య సాగిన వ్యవహారాన్ని పట్టించుకోలేదు. ఇదే దీప్తికి, శ్రీహాన్ కు మధ్యనున్న తేడా. గొప్ప ప్రేమికుడు ఎప్పుడూ తన ప్రేయసి లేదా ప్రియుడి తప్పులు చూడరు. కేవలం ప్రేమను మాత్రమే చూస్తారనడానికి శ్రీహాన్ గొప్ప ఉదాహరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    Also Read: ఇండస్ట్రీ పెద్ద కోసం మోహన్ బాబు పాకులాటే కొంపముంచిందా?

    Recommended Video: