CM KCR National Politics: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. మూడో కూటమి ఏర్పాటులో భాగంగా ఇప్పటికే తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు స్టాలిన్, విజయన్, మమతా బెనర్జీలతో సంప్రదించిన కేసీఆర్ మరో సీఎంను కలవాలని చూస్తున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలవాలని ముంబై వెళుతున్నారు. దేశ రాజకీయాలు, సమగ్రత కోసం థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకమని ఉద్దవ్ కేసీఆర్ ను ఆహ్వానించడంతో అందరి ఫోకస్ ఇప్పుడు వీరిద్దరిపై పడింది.
జాతీయ రాజకీయాల్లో తన ఉనికి చాటుకోవాలంటే మొదట ఎంపీ అయి ఉండాలి. దీంతో కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను తనకు అచ్చొచ్చిన కరీంనగర్ నుంచే రంగంలోకి దిగాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చూపంతా కరీంనగర్ పైనే ఉందని తెలుస్తోంది. ఇక్కడ ఎంపీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బం డి సంజయ్ ఉండటంతో కేసీఆర్ ఇక్కడి నుంచే పోటీకి దిగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో కూడా కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు. దీంతో ఈ మారు కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఈజల రాజేందర్ హుజురాబాద్ లో దెబ్బ తీసిన సందర్భంలో ఇక్కడ గెలిచి వారికి సవాలు విసరాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికి కరీంనగర్ పార్లమెంట్ స్థానం మరోసారి వేడెక్కనుంది.
Also Read: మూడో కూటమి ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నాలు ఫలించేనా?
అధ్యక్షుల పోరులో ఇద్దరు సమ ఉజ్జీలు బరిలో నిలిచి ఏ మేరకు తమ ప్రభావం చూపుతారో తెలియడం లేదు. ఏది ఏమైనా కేసీఆర్ మాత్రం జాతీయ రాజకీయాల్లో ప్రవేశం కోసం కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచే నాంది పలకనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే కరీంనగర్ లో బహుముఖ పోరు తప్పదని చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఇంకా ఎన్ని విచిత్రాలు చోటు చేసుకుంటాయో తెలియడం లేదు.
సెంటిమెంట్ ను పండించడంలో కరీంనగర్ ఓటర్లు కీలెరిగి వాతపెడతారని తెలుసు. దీంతో ఇక్కడి నుంచే బరిలో నిలిచి మరోమారు సెంటిమెంట్ ను రగించి అంటకాగాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా తన సత్తా చాటి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
Also Read: జగ్గారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిః కాంగ్రెస్ లో కొనసాగుతున్న విభేదాలు
Recommended Video: