Draupadi: మన సనాతన ధర్మంలో మహాభారతం ఓ అద్బుత గ్రంథం. మహాభారత గాథ మనందరికి తెలిసిందే. కౌరవులు, పాండవుల మధ్య జరిగిన పోరాటమే కురుక్షేత్రం. ఇందులో ప్రధాన పాత్ర ద్రౌపదిదే కావడం విశేషం. రామాయణంలో సీత, మహాభారతంలో ద్రౌపది లతోనే యుద్ధాలు జరిగాయని తెలుసు. పాండవులకు ఐదుగురికి భార్యగా ద్రౌపది ఉన్న సంగతి కూడా విధితమే. కానీ మనకు ద్రౌపది గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మనకు కూడా అనుమానం రావొచ్చు. ఐదుగురితో ఎలా కాపురం చేసిందనే అనుమానాలు కూడా వస్తాయి. ద్రౌపది ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేదట.
స్వయంవరంలో ద్రౌపదిని గెలిచిన అర్జునుడు తన తల్లి కుంతీదేవితో తాను ఓ బహుమానాన్ని తీసుకొచ్చానని చెప్పడంతో పరధ్యానంలో ఉన్న ఆమె ఐదుగురు కలిసి పంచుకోండని చెప్పడం జరుగుతుంది. దీంతో ద్రౌపది ఐదుగురికి భార్యగా అవుతుంది. ఐదుగురికి భార్యగా ఉన్నా తన పాతివ్రత్యాన్ని ఆమె త్యజించలేదు. ఎవరి దగ్గరకు వెళ్లినా కన్యత్వంతోనే వెళ్లేదట. ద్రౌపది తల్లి కడుపు నుంచి పుట్టలేదు. వరం వల్ల స్త్రీగానే ఆవిర్బవించిందని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి మహత్తర మహిమలు గల ద్రౌపది తన సంసారంలో ఎన్నో విషయాలు పాటించేది.
Also Read: National surveys: సర్వేల ఘోష: వైసీపీని ఓడించడం సాధ్యమవుతుందా? కాదా?
ఆమె ఎవరి దగ్గరయినా కొన్నాళ్లు ఉండేదట. ఒకరి దగ్గర ఉన్నప్పుడు మరొకరు అటు వైపు వెళ్లకూడదు. ఒక వేళ వెళితే వారు అరణ్యవాసం చేయాలనే నిబంధన పెట్టుకున్నారు. కానీ ఓసారి అర్జునుడు ఆ నిబంధనను ఉల్లంఘించాల్సి వస్తుంది. తన గోవులను దొంగలు ఎత్తుకెళ్తున్నారని ఓ వ్యక్తి వచ్చి అర్జునుడికి చెబుతాడు. అప్పుడు అర్జునుడి విల్లు ధర్మరాజు దగ్గర ఉంటుంది. ద్రౌపది కూడా ధర్మరాజు వద్దే ఉంది. కానీ విల్లు అవసరముందని శిక్ష అనుభవించడానికి సిద్ధపడి ధర్మరాజు దగ్గరకు వెళ్లి విల్లును తీసుకొస్తాడు. ఇలా నిబంధనను అతిక్రమించినందుకు అర్జునుడు అరణ్యవాసం చేస్తాడు.
ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నా ఏనాడు గొడవలు పడలేదు. భార్య విషయంలో ఎలాంటి అరమరికలు రాలేదు. ఐదుగురు శాంతియుతంగానే ఆమెను చూసుకునేవారు. ద్రౌపది తన భర్తలతో పాటు శ్రీకృష్ణుడిని నమ్మేది. ఆపద సమయంలో ఆయన సలహాలు తీసుకునేది. పందెంలో తనను పెట్టి ఓడిన పాండవులను కూడా ఎక్కువగా విశ్వసించేది కాదు. ద్రౌపది వస్త్రాభహరణంలో శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఆదుకున్న విషయం తెలిసిందే. విరాట రాజు కొలువులో కీచకుడు, నిండు సభలో కౌరవుల వల్ల తనకు జరిగిన అవమానంపై భర్తలను నమ్మేది కాదట.
ఒక భర్త నుంచి మరో భర్త దగ్గరకు వెళ్లే సమయంలో ఆమె అగ్ని నుంచి నడిచేది. దీంతో కన్యత్వం పొంది మళ్లీ కొత్తగా సంసారం చేసేది. ఇలా ద్రౌపది తనకున్న వరాలతో ఐదుగురు భర్తలతో సంసారం చేసినా ఏనాడు కూడా వారిలో ఎలాంటి మాటలు రాకపోవడం ఆశ్చర్యమే. అంతటి పాతివ్రత్యాన్ని ప్రదర్శించిన ద్రౌపది కథ మనందరికి ఆదర్శమే. తన ఇంట్లో సామను ఎప్పుడు నిండుగా ఉంచుకుని ఎవరు వచ్చినా భోజనం వండి పెట్టేది. అతిథిని మర్యాదగా చూసుకునేది.
ద్రౌపది కుక్కలకు ఓ శాపం పెట్టింది. ఓ సారి ఇంటి ముందు ధర్మరాజు చెప్పులు విడిస్తే ఓ కుక్క చెప్పును నోట కరుచుకుని వెళ్తుంది. దీంతో కోపోద్రిక్తురాలైన ద్రౌపది కుక్కలకు శాపం పెడుతుంది. మీరు మానవులు చూస్తుండగానే బహిరంగంగా శృంగారం చేస్తారని శపిస్తుందట. దీంతో ఆ శాపంతోనే కుక్కలు విచ్చలవిడిగా ఆరుబయటే శృంగారం చేస్తాయని చెబుతారు.
Also Read:Ram Column: ఆంధ్ర రాజకీయాల్లో జగన్ ప్రభావం ఎందుకు తగ్గటం లేదు?