Homeట్రెండింగ్ న్యూస్Nita Ambani Beauty Secret: నీతా అంబానీ నిజంగా సంతూర్ మమ్మీనే: ఇంతకీ ఆమె బ్యూటీ...

Nita Ambani Beauty Secret: నీతా అంబానీ నిజంగా సంతూర్ మమ్మీనే: ఇంతకీ ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా?

Nita Ambani Beauty Secret: సాధారణంగా వయసు మీద పడుతున్న కొద్దీ చాలామంది ముఖంలో మార్పులు వస్తుంటాయి. చర్మం క్రమంగా జీవాన్ని కోల్పోతూ ఉంటుంది. కానీ ఆసియా కుబేరుడు సతీమణి నీతా అంబానీ విషయంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. వయసు మీద పడుతున్న కొద్దీ ఆమె మరింత అందంగా మారుతోంది. ఇప్పటిదాకా అందమంటే జయమాలిని గురించో, శ్రీదేవి గురించో మనం ప్రస్తావిస్తూ ఉంటాం. ప్రస్తుతం నీతా అంబానీ వాలకం చూస్తుంటే ఆమె కూడా ఆ జాబితాలోకి ఎక్కే అవకాశం కనిపిస్తోంది. విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తగానే కాదు, స్టైల్, ఫ్యాషన్ తో ఆమె కట్టిపడేస్తున్నారు.

అందానికి తగ్గట్టు ఫ్యాషన్

వయసు పెరుగుతున్న కొద్దీ నీతా అంబానీ మరింత ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోతున్నారు. జువెలరీ, హ్యాండ్ బ్యాగులు, పాదరక్షలతోపాటు అధునాతన డ్రెస్సింగ్ సెన్స్, మేకప్ తో తల నుంచి కాలి వరకు ఫర్ఫెక్ట్ గా కనిపిస్తున్నారు. రిలయన్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఏ వేడుకలోనైనా నీతా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు అంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ నీతా అంబానీ అందం వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే మిక్కీ కాంట్రాక్టర్.

ఔరా కాంట్రాక్టర్

నీతా అంబానీ బ్యూటీ వెనుక ఉన్న పాపులర్ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ పాత్ర గురించి తెలిస్తే ఔరా అనక తప్పదు. మేకప్ మెన్ గా పలువురు సెలబ్రిటీలకు అతడు పని చేశాడు. టోక్యో బ్యూటీ పార్లర్ లో అతడు తర్ఫీదు పొందాడు. చాలా కృష్ణ సమయంలో నటి హెలెన్ హెయిర్ డ్రెస్సర్ గా పని చేశాడు. ఆమె సలహా మేరకు చిత్ర పరిశ్రమలోకి మేకప్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అలా హమ్ హై అప్కే కౌన్, కభీ ఖుషి కభీ గం, కల్ హో నా హో, మోహబ్బతే, మై నేమ్ ఈజ్ ఖాన్, కార్తీక్ కాలింగ్ కార్తీక్, డాన్, గుడ్ వంటి బాలీవుడ్ సినిమాలకు మేకప్ మేనగా పని చేశాడు. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయాల ఆధారంగా బాలీవుడ్ నటీమణులు కరీనాకపూర్, దీపిక పదుకొనే, ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ దాకా మిక్కీ కాంట్రాక్టర్ మేకప్ మెన్ గా పని చేశాడు.

నీతా అంబానికి మాత్రమే కాదు

నీతా అంబాని కి మాత్రమే కాదు ఆమె కుమార్తె ఇషాతో పాటు పెద్ద కోడలు శ్లోకా అంబానికి కూడా మిక్కీ పర్సనల్ మేకప్ మెన్. ముంబైలో నివాసం ఉండే ఇతడు తన సేవలకు గానూ రోజుకు రూ. లక్షల్లో ఛార్జ్ చేస్తాడు. అంబానీ కుటుంబం దగ్గర పనిచేస్తున్న మిక్కి జీతం పలు కంపెనీలకు చెందిన సీఈఓ ల వేతనం కంటే ఎక్కువే..ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇక నీతా అంబానీ విషయానికి వస్తే ఆమె తన అందమైన కళ్ళను మరింత అందంగా కాపాడుకుంటారు. ఆకర్షణీయంగా తీర్చిదిద్దే విషయంలో ఏమాత్రం రాజీపడరు. తన ఐబ్రోస్ నీట్ షేప్ లో ఉండేలా చూసుకుంటారు. అదే సమయంలో ఆమె తన మస్కారాను ఎప్పుడూ మర్చిపోరు. ఒకరకంగా చెప్పాలంటే అది ఆమె సిగ్నేచర్ లుక్. అంతేకాదు నీతా అంబానీ కష్టమైజ్డ్ లిప్ స్టిక్ కలెక్షన్ చూస్తే అదిరిపోవాల్సిందే. బంగారం, వెండి, ఇతర అరుదైన లోహాలతో తయారు చేసిన లిప్స్టిక్ ఒక్కో బాటిల్ ధర 40 లక్షలకు పైగానే ఉంటుంది. కేవలం అందం విషయంలో మాత్రమే కాదు ముంబై ఇండియన్స్ జట్టు అధిపతిగా, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ గా, రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, ధీరూ భాయ్ అంబానీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేతగా నీతా అంబానీ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు.. అన్నట్టు అంబానీ కుటుంబానికి సంబంధించిన ఏ వేడుకలో అయినా నీతా కచ్చితంగా నృత్యం చేస్తారు. అన్నట్టు నీతా అంబానీ వయసు ప్రస్తుతం 60 సంవత్సరాలు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular