Nita Ambani Watch: ప్రపంచ కుభేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ గురించి ఎంత చెప్పినా తక్కువే. దశాబ్దాలుగా మిలియనీర్ స్టానంలోనే కొనసాగుతున్న ఈయన బిజినెస్ రంగంలో అగ్రగామిగా నిలుస్తున్నారు. ముఖేష్ తో పాటు ఆయన కుమారులు, కుమార్తె లు సైతం వ్యాపారంలో రాణిస్తున్నారు. ఇక ముఖేష్ సతీమణి నీతూ అంబానీ సైతం ఐపీఎల్ లో పెట్టుబడులు పెట్టి ప్రత్యేకంగా నిలిచారు. ముంబై ఇండియన్స్ తరుపున ప్రాంచైజీగా ఉన్న నీతూ అంబానీ ఇటీవల ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. అత్యంత ఖరీదైన ఆభరణాలు కనిపించి ఆకట్టుకున్నారు. ఈ తరుణంలో ఆమె చేతికున్న వాచిపై అందరి దృష్టి పడింది. దీంతో ఆమె చేతి వాచి ధర ఎంత? అది ఏ కంపెనీ? అని అందరూ ఆరా తీస్తున్నారు.
నీతూ అంబీనీ లైఫ్ ప్రత్యేకంగా ఉంటుంది. మేకప్ నుంచి ఆమె ధరించే ఆభరణాలు అత్యంత ఖరీదైనవి ఉంటాయి. ప్రపంచంలోనే విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి నీతూ ఇష్టపడుతూ ఉంటారు. ఓ వైపు సీరియస్ గా బిజినెస్ చేస్తూనే మరోవైపు డ్రెస్సింగ్ ఇతర వస్తువులను ధరించడంలో ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్ గా నీతూ అంబానీ ధరించిన వాచ్ ధరపై అందరికీ ఆసక్తి నెలకింది.
నీతూ అంబానీ ధరించిన ఈ గడియారం అక్షరాల రూ.85 లక్షలు అని తెలుస్తోంది. ఇది సాదా సీదా వాచ్ అయితే అంత ఉండకపోవచ్చు. కానీ ఇందులో డయల్, కేస్, లగ్స్ వజ్రాలు పొదిగి ఉన్నాయి. పటేక్ ఫిలిప్ సంస్థ తయారు చేసిన ఈ వాచ్ ను సంపన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మనదేశంలో ఇప్పటి వరకైతే ఈ వాచ్ నీతూ అంబానీ మాత్రమే ధరించి ఉంటారని అనుకుంటున్నారు. అయితే ఇంతటి ఖరీదు పెట్టి వాచ్ కొనుగోలు చేయడం వల్ల ఏం వస్తుంది? అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
అయితే కొందరు సినీ నటులు, ప్రముఖులు ఖరీదైన వాచ్ లు ధరిస్తూ ఉంటారు. కానీ మరీ రూ.85 లక్షల వాచ్ ను ధరించిన వారు ఎవరూ లేరనే చర్చ సాగుతోంది. అయితే మరికొంత మంది మాత్రం ఇంత డబ్బు పెట్టి వాచ్ కొనే బదులు ఎవరికైనా సాయం చేయొచ్చుగా అని అంటున్నారు. అయితే వీటికి రిప్లై ఇస్తూ వారి డబ్బు వారిష్టం.. మీకెందుకు? అని రిప్లై కామెంట్లు పెడుతూ హల్ చల్ చేస్తున్నారు.