
Telangana Ambedkar Statue: ఆకాశమంతా ఎత్తులో దేశంలోనే అతి పెద్ద విగ్రహం.. భారత జాతి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం.. హుస్సేన్ సాగర తీరాన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం ఏప్రిల్ 14న ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గార్డెన్ పక్కన 11.34 ఎకరాల్లో నిర్మీతమైన ఈ విగ్రహం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించింది. 2021 జూన్ 3న నిర్మాణం మొదలు పెట్టిన ఈ విగ్రహం పూర్తి కావడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది. అయితే కరోనా కారణంగా కొన్ని రోజులు జాప్యమైంది లేకుంటే ఇప్పటికే ఈ విగ్రహావిష్కరణ జరిగిపోయేది. ఈ నేపథ్యంలో ఈ విగ్రహానికున్న ప్రత్యేకతలు తెలిసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి వాటి గురించి తెలుసుకుందామా.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అంటే ఇష్టముండని వారుండరు. ఆయన గురించి భవిష్యత్ తరాల వారికి తెలిపేలా ఆయన గుర్తుగా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు 2016 ఏప్రిల్ 14న శంకుస్థాపన చేశారు. ఆ తరువాత విగ్రహ నిర్మాణ బాధ్యతలు చూసుకోవడానికి ఇదే సంవత్సరం నవంబర్ 4న విగ్రహావిష్కరణ కమిటిని ఏర్పాటు చేశారు. అయితే ఆ తరువాత కొన్ని కారణాల వల్ల విగ్రహ నిర్మాణ పనుల్లో జాప్యమైంది.
అయినా ప్రత్యేక శ్రద్ధ వహించి 2018 ఏప్రిల్ 4న మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థకు నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. విగ్రమం కింద పార్లమెంట్ ఆకృతి వచ్చేలా ఉండాలని నిర్ణయించారు. ఈ నమూనాకు జీవం పోసింది రాంజీ సుతార్. ఈ నమూనాకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. విగ్రహ నిర్మాణానికి ముందుగా రూ.146.50 కోట్ల బడ్జెట్ ను రూపొందించారు. 2020 సెప్టెంబర్ 16న ఈ నిధులను ఆమోదిస్తూ ఎస్సీ డెవలప్మెంట్ శాఖ ఆమోదం తెలిపింది. ఆ వెంటనే రోడ్ల భవనాల శాఖ నుంచి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

125 అడుగుల ఎత్తు ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ముందుగా ఉక్కుతో తయారు చేసి ఆ పై ఇత్తడి తొడుగులను బిగించారు. ఇందులో కోసం ఉక్కును 360 టన్నులు, ఇత్తడిని 114 టన్నులను ఉపయోటించారు. ఇత్తడి నమూనాను ఢిల్లీలో తయారు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. దాదాపు 3 దశాబ్దాల పాటు మెరుస్తూ ఉండేలా పాలీయురేతీన్ కోటింగ్ వినియోగించారు. ఇక విగ్రహం బేస్ 50 అడుగులు ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ 172 అడుగులు, టెర్రాస్ 74 అడుగుల ఎత్తుతో నిర్మించారు. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం 15,200 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంది.